Drushyam 2 trailer is out: మలయాళంలో హిట్టయైన దృశ్యం-2ను.. తెలుగులో అదే పేరుతో విక్టరీ వెంకటేష్​, మిన జంటగా రిమేక్ చేశారు. ఈ సినిమా ట్రైలర్​ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దృశ్యం మొదటి భాగానికి కొనసాగింపుగా ఈ సినిమా కొనసాగున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఆరేళ్ల క్రితం ఓ హత్య కేసు నుంచి బయట పడ్డ రాంబాబు ఫ్యామిలీని మళ్లీ అదే టెన్షన్ వెంటాడుతున్నట్లు ట్రైలర్​లో చూపించారు.


ఓ వైపు రాంబాబు (వెంకటేష్) సినిమా తీసే బిజీలో ఉంటాడు.. మరో వైపు పాత కేసును ఓపెన్ చేసి పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్​ చేస్తున్నట్లు ఇందులో ట్రేలర్ ద్వారా తెలుస్తోంది.


రాంబాబు కేస్ ఏమైంది? రాంబాబును పోలీసులు ఏం చేయలేరంటూ.. రాంబాబు చట్టుపక్కల వాళ్లు మాట్లాడుకోవడం ట్రైలర్​లో కనిపిస్తుంది.


Also read: Gangubai Kathiawadi Release: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ‘గంగూబాయి’


ఆసక్తి రేపుతున్న రీ ఇన్వెస్టిగేషన్ డైలాగ్స్​..


ఇదే సమయంలో రాంబాబు సినిమా తీసే బిజీలో ఉన్నాడు.. పోలీసులకు దొరకనన్న ఓవర్​ కాన్ఫడెన్స్​తో​ ఉన్నాడు. సినిమా తీసేలోపు మనమే వాడికి సినిమా చూపిద్ధాం అంటూన్న డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.


మరోవైపు రాంబాబు.. భయపడకు మీ ముగ్గురికి ఏం జరగనివ్వను (భార్య, ఇద్దరు కూతుళ్లను ఉద్దేశించి) అంటాడు. ఈ డైలాగ్స్ అన్నీ సినిమాపై హైప్ పెంచుతున్నాయి.


మరి పాత కేసు విచారణలో మళ్లీ రాంబాబు ఫ్యామిలీకి ఎలాంటి చిక్కులు ఎదురయ్యాయి. వాటిని కుటుంబం అంతా ఎలా ఎదుర్కొంది? ఈ సారి రాంబాబు మర్డర్ చేసిన యువకుడిని ఎక్కడ పాతిపెట్టింది చెప్పేస్తాడా? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం తెలియాలంటే.. నవంబర్ 25 వరకు ఆగాల్సిందే. ఆ రోజు ఈ సినిమా అమెజాన్​ ప్రైమ్​లో రిలీజ్ చేయనున్నారు.


మళయాలంలో మోహన్​లాల్​ ప్రధాన పాత్రదారుగా ఈ సినిమాను తెరకెక్కించారు. మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ ఈ సినిమానూ రూపొందించారు.



Also read: Suriya: హీరో సూర్య పెద్ద మనస్సు- అమెకు రూ.10 లక్షల ఫిక్స్​డ్​ డిపాజిట్​!


Also read: Natu natu song dance viral videos: నాటు నాటు పాటకు ట్రాఫిక్ సిగ్నల్లో నాటు స్టెప్పులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook