Suriya: హీరో సూర్య పెద్ద మనస్సు- అమెకు రూ.10 లక్షల ఫిక్స్​డ్​ డిపాజిట్​!

Parvathi Ammal: జై భీమ్ సినిమాలో సినతల్లి క్యారెక్టర్​కు రియల్​లైఫ్​ ఇన్స్​ప్రెషన్ అయిన పార్వతి అమ్మళ్​కు హీరో సూర్య ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు. అమె పేరిట ఫిక్స్​డ్​ డిపాజిట్ చేసి..నెల నెల ఆదాయం వచ్చేట్లు చూడనున్నట్లు వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2021, 10:27 PM IST
  • పెద్ద మనస్సు చాటుకున్న హీరో సూర్య
  • రియల్ లైఫ్ సినతల్లికి ఆర్థిక సహాయం
  • ఇప్పటికే గిరిజనుల సంక్షేమం కోసం రూ.కోటి సాయం
Suriya: హీరో సూర్య పెద్ద మనస్సు- అమెకు రూ.10 లక్షల ఫిక్స్​డ్​ డిపాజిట్​!

Suriya has announced deposit Rs 10 lakh in the name Parvathi Ammal: తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. జై భీమ్ సినిమాలో సినతల్లి క్యారెక్టర్​కు ఇన్స్​ప్రెషన్​ అయిన.. పార్వతి అమ్మళ్​కు ఆర్థిక సహాయం (Suriya help to Parvathi Ammal) అందించాలని నిర్ణయించారు.

28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవిక ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా 'జై భీమ్‌'(Jai bhim). నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్​లో విడుదలై అన్ని వర్గాల నుంచి మంచి స్పందనను దక్కించుకుంది.

కులతత్వం, పోలీసుల క్రూరత్వం, సమాజంలో మానవ హక్కులు ఏ విధంగా హరించివేయబడుతున్నాయనే అంశం నేపథ్యంలో ఈ సినిమా కథ (Jai Bhim story) సాగుతుంది. ఈ సినిమాపై విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. సినిమా మొత్తం సినతల్లి, రాజన్నల కోణంలోనే సాగుతుంది.

సినతల్లి భర్తను పోలీసులు అరెస్టు చేసి.. లాకప్​ డెత్​ చేస్తారు పోలీసులు. అది కప్పి పుచ్చుకునేందుకు పోలీసులు, పోలీసుల తరఫు న్యాయవాధుల ప్రయత్నిస్తుంటారు. వారిని ఎదుర్కొనే క్రమంలో సినతల్లి పడే కష్టాలు, వారికి సహాయం చేసే పాత్ర (చంద్రూ)లో సూర్య చేసే ప్రయత్నాలు అందరి మనసులు కదిలిస్తాయి.

Also read: Natu natu song dance viral videos: నాటు నాటు పాటకు ట్రాఫిక్ సిగ్నల్లో నాటు స్టెప్పులు

ఇందులో సినతల్లి పడిన కష్టాలను నిజజీవితంలో అప్పట్లో పార్వతి అమ్మల్ నిజంగానే ఎదుర్కొన్నారు. అమె ఇప్పటికీ ఇంకా పేదరికంలోనే ఉన్నారు. దీనితో అమెకు సహాయంగా రూ.10 లక్షలు ఫిక్స్​డ్​ డిపాజిట్ చేయాలని సూర్య నిర్ణయించుకున్నారు.

ఇప్పటికే గిరిజనుల సంక్షేమం కోసం రూ.కోటి విరాళాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్​కు అందిచారు సూర్య. ఆయన భార్య జ్యోతికతో కలిసి ఈ సహాయాన్ని అందించాడం గమనార్హం.

Also read: Gangubai Kathiawadi Release: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ‘గంగూబాయి’

Also read: Samantha item song in Pushpa: పుష్ప మూవీలో సమంత ఐటం సాంగ్

ఇంటిని నిర్మిస్తానని లారెన్స్ హామి..

నటుడు, దర్శకుడు, డ్యాన్సర్ లారెన్స్(Raghava Lawrence) కూడా ఈ సినిమా చూసి చలించిపోయారు. ఆమె కష్టాలు ఇంకెవరికి రావొద్దని ఇటీవల పేర్కొన్నారు. అమెకు ఇంటిని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.

జై భీమ్​ సినిమాకు.. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు. ఇందులో సూర్యతో పాటు, ప్రకాశ్ రాజ్ (పోలీస్ ఆఫీసర్)​, రావు రమేశ్​ (ప్రభుత్వం తరఫు న్యాయవాది), లిజోమోల్ జోసీ (సినతల్లి), మణికంఠన్ (రాజన్న) ప్రధాన పాత్రదారులు. ఈ సినిమాకు నిర్మాతలుగా సూర్య, జ్యోతికలు వ్యవహరించడం గమనార్హం.

Also read: Vikram, Vijay Sethupathi: కమల్​ కథతో.. విక్రమ్​, విజయ్​ సేతుపతి మల్టీ స్టారర్​!

Also read: Mahesh-Rajmouli Combo: సమంత 'దూకుడు'.. మహేష్-జక్కన్న సినిమాలో హీరోయిన్‌గా సామ్..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News