Natu natu song dance viral videos: నాటు నాటు పాటకు ట్రాఫిక్ సిగ్నల్లో నాటు స్టెప్పులు

Natu natu song dance viral videos: ఎంతో ఎనర్జి అందించేలా ఉన్న నాటు నాటు సాంగ్‌కి ఎన్టీఆర్, చరణ్ (Jr Ntr, Ram Charan) తోడయ్యారు. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. నాటు నాటు సాంగే కనిపిస్తోంది.. వినిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2021, 06:17 PM IST
  • నాటు నాటు సాంగ్‌పై #RRRMassAnthem వీడియోలు.
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాటు నాటు సాంగ్ స్టెప్స్.
  • తారక్, చరణ్ నాటు స్టెప్సుకి ఫిదా అవుతున్న నెటిజెన్స్.
Natu natu song dance viral videos: నాటు నాటు పాటకు ట్రాఫిక్ సిగ్నల్లో నాటు స్టెప్పులు

Natu natu song dance viral videos: దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి నాటు నాటు సాంగ్ ఏ క్షణం రిలీజైందో.. అప్పటి నుంచే అభిమానులను షేక్ చేస్తోంది. నాటు నాటు నాటు... వీర నాటు అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి స్టెప్పేసిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నాటు నాటు సాంగ్ బాగా నచ్చేసింది. పైగా ఊర మాస్ స్టైల్లో కీరవాణి కంపోజ్ చేసిన ట్యూన్‌కి తారక్, చెర్రీ (Ntr, Ram Charan) స్టెప్పులేసిన తీరు తెలుగు వారినే కాకుండా ఇతర అన్ని భాషల ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. 

నాటు నాటు పాటపై (Natu natu song lyrics) అభిమానులు డ్యాన్స్ చేసి #RRRMassAnthem హ్యాష్ ట్యాగ్‌తో ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నాటు నాటు సాంగ్‌కి లభించిన క్రేజ్ కారణంగా అభిమానులు డ్యాన్స్ చేసి పోస్ట్ చేస్తున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. వాటికి కూడా అప్పుడే మిలియన్ల కొద్ది వ్యూస్ లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నాటు నాటు పాటపై డ్యాన్స్ చేసిన ఓ యువకుడు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను పోస్ట్ చేసిన వీడియోకు ఆర్ఆర్ఆర్ మూవీ (RRR movie) యూనిట్‌ని కూడా ట్యాగ్ చేయడంతో చిత్ర బృందం ఆ ట్వీట్‌ని మాస్ అని పేర్కొంటూ రిట్వీట్ చేసింది. ఇంకేం.. ఆ కుర్రాడి వీడియో ఇంకెక్కడికో వెళ్లిపోయింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also read : Samantha item song in Pushpa: పుష్ప మూవీలో సమంత ఐటం సాంగ్

చంద్రబోస్ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కలిసి పాడారు. రాజమౌళి చిత్రాలకు రెగ్యులర్‌గా మ్యూజిక్ అందించే కీరవాణి ఈసారి కూడా ఎప్పటికంటే ఎక్కువ ఎనర్జీతో నాటు నాటు సాంగ్ కంపోజ్ చేశాడు. ఎంతో ఎనర్జి అందించేలా ఉన్న నాటు నాటు సాంగ్‌కి ఎన్టీఆర్, చరణ్ (Jr Ntr, Ram Charan Natu dance) తోడయ్యారు. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. నాటు నాటు సాంగే కనిపిస్తోంది.. వినిపిస్తోంది.

Also read : Attack on Actress Shalu Chourasia: 'ఓ పిల్లా నీ వల్ల' సినిమాలో నటించిన హీరోయిన్ పై దాడి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News