Guntur Kaaram promo: గుంటూరు కారం నుంచి దమ్ మసాలా ప్రోమో విడుదల.. మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్..
Guntur Kaaram: ప్రస్తుతం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న గుంటూరు కారం. ఈ చిత్రం నుంచి చిన్న అప్డేట్ వచ్చినా చాలు పండగ చేసుకుంటాం అని మహేష్ అభిమానులు అనుకుంటున్న తరుణంలో ..ఇప్పుడు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రోమో వాళ్ళని తెగ ఖుషి చేస్తోంది.
Mahesh Babu :ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా లాంటి క్లాసిక్ హిట్స్ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తూ ఉన్న మూడో సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఈ చిత్ర మేకర్స్ ఆలస్యం చేస్తూ ఉండడంతో కొంచెం ఆగ్రహానికి గురయ్యారు మహేష్ ఫ్యాన్స్. మొన్నటి వరకు కేవలం ఒక పోస్టర్ అలానే ఒక చిన్న వీడియోని మాత్రమే విడుదల చేశారు గుంటూరు కారం నిర్మాతలు.
కానీ ఇప్పుడు వారందరికీ ఫుల్ మీల్స్ పెట్టేస్తూ.. గుంటూరు కారం నుంచి ఒక సూపర్ ప్రోమో ని ఈ చిత్ర మేకర్స్ విడుదల చేసేశారు. ఇప్పటీకే పలుమార్లు వాయిదా పడిన గుంటూరు కారం సినిమా సంక్రాతికి జనవరి 12న ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేసి తీరుతామని నిర్మాత నాగవంశీ ఇటీవల క్లారిటీ ఇచ్చారు.
ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ చిత్రం అప్డేట్స్ గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు ఫస్ట్ సాంగ్ దసరాకి రిలీజ్ చేస్తామని కొద్ది రోజుల క్రితం నిర్మాత హామీ ఇచ్చారు. కాగా దసరా అయిపోయిన ఇంకా ఆ పాట విడుదల చేయకపోవడం.. మహేష్ అభిమానులను నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం ఈ సినిమా నుంచి ఓ పాట లీక్ అయి నెట్టింట వైరల్ అయింది.
ఇక ఆలస్యం చెయ్యడం మంచిది కాదు అని నిర్ణయించుకున్న గుంటూరు కారం నిర్మాతలు ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా.. ప్రోమోని రేపు విడుదల చేస్తామని నిన్ననే ప్రకటించారు. ఇక ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ గత కొద్ది నిమిషాల క్రితమే దమ్ మసాలా అంటూ సాగే పాట ప్రోమోని విడుదల చేశారు. ఇందులో ఎలాంటి వీడియో బైట్స్ చూపించకుండా కేవలం మోషన్ పోస్టర్ తోనే పాట రిలీజ్ చేశారు.
ఫుల్ సాంగ్ త్వరలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
కానీ పాట అలానే ఆ పాట కి మ్యూజిక్ అదిరిపోవడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ ఖుషి గా ఉన్నారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read: IND Vs SL Highlights: శ్రీలంకకు టీమిండియా అదిరిపోయే పంచ్.. సెమీస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ..!
Also Read: Skin Care Tips: ఈ పదార్ధాలు దూరం చేయకుంటే మీ చర్మం కాంతి విహీనంగా అందవికారంగా మారడం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook