Dwarakish Passes Away: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ శాండిల్ వుడ్ నటుడు ఎన్టీఆర్ అవార్డు గ్రహీత ద్వారకీష్‌ గుండెపోటుతో కన్నుమూసారు. ఆయన వయసు 81 యేళ్లు. 1963లో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ద్వారకీష్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆయుష్మాన్ భవ, ఆప్తమిత్ర, విష్ణు వర్ధన వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించారు. ఆయన మృతి పట్ల కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం వ్యక్తం చేసింది. మరోవైపు ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ద్వారకీష్ 1942లో ఆగష్టు 19న మైసూర్‌లో జన్మించారు. ఆయన బాల్యం అంతా అక్కడే గడిచింది. ముందుగా ఆటో స్పేర్ పార్ట్స్ బిజినెస్‌లో ప్రవేశించి ఆ తర్వాత సినిమాలపై మోజుతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.  సినిమా ఇండస్ట్రీలో ఉంటూనే తన ఫ్యామిలీకి సంబంధించి బిజినెస్ వ్యవహారాలను చూసుకునేవారు. ఆయన రాజ్ కుమార్, భారతి జోడిగా నటించిన 'మేయర్ ముత్తన్న' సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించి నిర్మాతగా ఈయనకు కాసుల వర్షం కురిపించింది. ఈయన విష్ణువర్ధన్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించడమే కాదు..పలు సినిమాలను నిర్మించారు. వీళ్లిద్దరి జోడికి అప్పట్లో మంచి పేరు వచ్చింది.


Also read: Jagan Convoy: సీఎం జగన్‌ పర్యటనలో అపశ్రుతి.. వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook