Bigg Boss Telugu: ‘స్టార్ మా’తో ముగిసిన బిగ్ బాస్ అగ్రిమెంట్.. ఈసారి వేరే ఛానల్లో
Endemol Shine India Contract with Star Maa: సుదీర్ఘ కాలంగా స్టార్ మాలో ప్రసారం అవుతూ వస్తున్న బిగ్ బాస్ షో ఇక మీదట ఆ ఛానల్లో కనిపించక పోవచ్చు, అదేమిటి అనుకుంటున్నారా? అవును నిజమే, ఆ వివరాల్లోకి వెళితే
Endemol Shine India Contract with Star Maa Completed for Bigg Boss Telugu: ఎక్కడ నెదర్లాండ్స్ అనే దేశంలో పుట్టిన బిగ్ బ్రదర్ అనే కార్యక్రమం సూపర్ హిట్ కావడంతో అదే కంపెనీ ఆ కార్యక్రమాన్ని అనేక దేశాల్లో నిర్వహిస్తూ వస్తోంది. హిందీలో బిగ్ బాస్ పేరుతో తీసుకొచ్చిన కార్యక్రమం సూపర్ హిట్ కావడంతో తెలుగు సహా దక్షిణాది భాషల్లో అలాగే కొన్ని నార్త్ ఇండియా భాషల్లో కూడా బిగ్ బాస్ అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తెలుగులో ఇప్పటికే ఈ కార్యక్రమం 6 సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండవ సీజన్ కి హీరో నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక మూడో సీజన్ నుంచి ఆరో సీజన్ వరకు నాగార్జున హోస్ట్గా వ్యవహరించారు. మధ్యలో ఒక ఓటీటీ సీజన్ కూడా నిర్వహించారు. అయితే ఇండియాలో ఎన్డీమోల్ షైన్ అనే ఒక సంస్థ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించేందుకు హక్కులు కలిగి ఉంది.
ఈ ఆరేళ్లపాటు ఈ కార్యక్రమాన్ని స్టార్ మా లో మాత్రమే టెలికాస్ట్ చేయాలనే కాంట్రాక్టు ఆ సంస్థకు ఉండేది. అయితే తాజాగా ఆ కాంట్రాక్ట్ అయితే పూర్తయింది. దీంతో ఇప్పుడు మరోసారి స్టార్ మా యాజమాన్యం అలాగే బిగ్ బాస్ యాజమాన్యం ఏడవ సీజన్ కి సంబంధించిన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ చర్చలు గనుక విఫలమైతే వేరే ఛానల్ వాళ్ళతో కూడా ఎన్డీమోల్ షైన్ సంస్థ సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది.
ప్రస్తుతానికైతే స్టార్ మాతోనే చర్చలు జరుగుతున్నాయని ఆ చర్చలు విఫలమైతే అప్పుడు వేరే ఛానల్ వరకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు, అయితే ఎక్కువగా స్టార్ మాతోనే ఈ ఒప్పందం కొనసాగే అవకాశం కనిపిస్తోంది, ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక భారీ షోగా భావిస్తున్నారు. స్టార్ మాకి, హాట్ స్టార్ కి తెలుగువారికి మధ్య కనెక్షన్ ఏర్పడడానికి బిగ్ బాస్ కూడా ఒక ముఖ్య కారణంగా స్టార్ మా యాజమాన్యం భావిస్తోంది.
అందుకే స్టార్ మా యాజమాన్యం వేరే వాళ్ళ చేతిలోకి బిగ్ బాస్ షోని వెళ్ళనిచ్చే అవకాశాలు అయితే తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ సెవెన్ హోస్టుగా బాలకృష్ణ వ్యవహరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది కానీ నాగార్జున మాత్రం దగ్గుబాటి రానా పేరును రికమండ్ చేసినట్లు చెబుతున్నారు. అంతేకాక ఈసారి బిగ్ బాస్ సెవెంత్ సీజన్ చాలా ఎర్లీగా మొదలు పెడతారని జూలై నెలలో ప్రారంభించి అక్టోబర్, నవంబర్ నెలలోపు పూర్తిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓటీటీ సీజన్ వన్ ఫ్లాప్ కావడంతో రెండవ సీజన్ ప్లాన్లు విరమించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: BookMyShow: 2022 బుక్ మై షో టాప్ టెన్ సినిమాలివే.. తెలుగు నుంచి ఒక్కటే కానీ?
Also Read: Bandla Ganesh: ఫిలిం జర్నలిస్టుపై బండ్ల గణేష్ దారుణ ట్వీట్లు.. ఒక రేంజ్ లో రెచ్చిపోయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.