COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Erra Cheera - The Beginning: ఎర్ర చీర ది బిగినింగ్ అనే మూవీని శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్, సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా పూర్తయ్యాయి. గ్రాఫిక్స్ చివరి దశ ఎడిటింగ్ ముగియడంతో త్వరలోనే విడుదల కాబోతున్నట్లు సినిమా బృందం తెలిపింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనమరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో పరిచయం కాబోతోంది. ఈ సినిమాలో అద్భుతమైన గ్రాఫిక్స్ కలిగి ఉంటుందని.. 45 నిమిషాలు ఎన్నో ఇంట్రెస్టింగ్ కలిగించే సన్నివేశాలు చూస్తారని డైరెక్టర్ సుమన్ బాబు తెలిపారు. అలాగే ఈ సినిమాలు తను కూడా కీలకపాత్రలో ఉన్నట్లు సుమన్ బాబు వెల్లడించారు. 


ఈ సినిమా అద్భుతమైన మదర్ సెంటిమెంటుతో పాటు హర్రర్, యాక్షన్, కామెడీతో అందరినీ అలరించబోతున్నట్లు నిర్మాత సుబ్బిరెడ్డి వెల్లడించారు. బేబీ సాయి తేజస్విని అద్భుతంగా ఈ సినిమాలో నటించారని సరికొత్త సన్నివేశాలతో అద్భుతమైన మదర్ సెంటిమెంట్తో క్లైమాక్స్లో అందరిని కన్నీరు తెప్పిస్తుందని నిర్మాత తెలిపారు. అంతేకాకుండా కారుణ్య చౌదరి కూడా ఈ సినిమాలో అద్భుతమైన పాత్రలో అలరించబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో శ్రీరామ్ తో పాటు రఘుబాబు మొదలైన వారు ఉన్నారు.


ఇక ఈ సినిమాకు సంబంధించిన బ్యాగ్రౌండ్ స్కోర్ విషయానికొస్తే.. ఎంతో అద్భుతంగా ఉంటుందని సినీ టీం చెబుతోంది. అద్భుతమైన ఆడియో సెట్ అప్ తో హర్రర్ సీన్స్ చాలా బాగుంటాయి. అంతేకాకుండా మీరు ఈ సినిమాలో ప్రీమియం మ్యూజిక్ ని పొందుతారని ఎస్ చిన్న, ప్రమోద్ పులి గార్లు తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా సౌండ్ ఎఫెక్ట్స్ అచ్చం బాలీవుడ్ లోని హర్రర్ సినిమాల ఎఫెక్ట్స్ లా ఉంటాయని మ్యూజిక్ ప్రదీప్ తెలిపారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ విషయానికొస్తే.. సినీ బృందం దీనిని డిసెంబర్ 20 తేదీన తెలుగుతోపాటు కన్నడ భాషలో విడుదల చేయబోతోంది. విజయదశమి సందర్భంగా సినిమా బృంద ఈ విడుదల విషయాన్ని తెలిపింది.


ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.