Ashu Reddy & Express Hari Love Track: బుల్లితెరపై రష్మీ సుధీర్, వర్ష ఇమాన్యుయేల్, రాకేష్ సుజాత, అషూ రాహుల్, అషూ ఎక్స్ ప్రెస్ హరి ఇలా ఎన్నెన్నో ట్రాకులున్నాయి. ఇందులో సుజాత రాకేష్‌ ట్రాక్ మాత్రం పెళ్లి వరకు వెళ్లింది. వర్ష ఇమాన్యుయేల్ అయితే పక్కా స్క్రిప్టెడ్‌ అని అర్థం అవుతుంటుంది. రష్మీ సుధీర్ స్టేజ్ మీద ఎన్ని నాటకాలు ఆడినా తెర వెనక ఏమీ ఉండదని అందరికీ తెలిసిసోయింది. అషూ రెడ్డి మాత్రం ఎటూ అర్థం కాదు. రాహుల్‌తో ఉంటుంది, హరితోనూ ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అషూ రెడ్డి బుల్లితెరపై చేసిన కామెడీ స్టార్స్ షోలో ఎక్స్ ప్రెస్ హరితో ట్రాక్ సెట్ చేసింది టీం. హరి అషూల ట్రాక్ బాగానే వర్కౌట్ అయింది. హరి కోసం బైక్ కొనిచ్చింది అషూ. ఇక అషూ పేరుని ఎదపై టాటూ వేయించుకున్నాడు హరి. అది నిజమైన టాటూనా? కాదా? అన్నది మాత్రం క్లారిటీగా తెలియడం లేదు. పదే పదే ఆ టాటూని చూపిస్తుంటాడు హరి.


అయితే ఈ ఇద్దరూ ఇప్పుడు శ్రీముఖి చేస్తోన్న ఓ షోకు గెస్టులా వచ్చారు. ఇందులోనూ మళ్లీ పాత పాటే పాడారు. ట్రూత్ ఆర్ డేర్ అనే గేమ్ ఆడగా.. డేర్ అని ముందుకు వచ్చాడు హరి. అషూకి ముద్దు పెట్టాలని శ్రీముఖి టాస్క్ ఇచ్చింది. ఇక ముద్దు పెట్టడమే కాదు స్టేజ్ మీదే ప్రపోజ్ చేశాడు హరి. 



వాళ్లేదో టాస్క్ ఇచ్చారు.. ఎందుకు ఇలా చేస్తున్నావ్ అన్నట్టుగా అషూ అంటుంది. టాస్క్ అయినా కూడా ఇది నిజంగా చెబుతున్నాను.. ఐ లవ్యూ అషూ.. అని మోకాళ్ల మీద కూర్చుంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావ్..  ఏడుస్తున్నావ్ అంటూ అషూ కాస్త విసుక్కుంటుంది. నిజంగానే ప్రేమిస్తున్నాడు.. ఒప్పుకోవచ్చు కదనే అని అరియానా అంటుంది. ఇక అషూ రెడ్డి మాత్రం ఏం చేయాలో పాలు పోనట్టుగా చూస్తుంది. హరి మాత్రం అలానే బాధపడుతూ ఉంటాడు.


ఇక ఇది నిజంగానే జరిగిందా? లేదా టీఆర్పీ స్టంట్లా? ప్రోమో స్ట్రాటజీ అన్నది తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే. నిజంగానే అషూని హరి ప్రేమిస్తున్నాడా? అని కొందరు అంటుంటే.. ఇలాంటివి ఎన్నో చూశాం.. మీరు ఆపండి ఇక అంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.


Also Read:  Allu Arjun Telugu Pride : బన్నీ పెట్టిన మంట.. ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్.. రెచ్చిపోతోన్న మెగా, నందమూరి ఫ్యాన్స్


Also Read: Anasuya Bharadwaj Family : ఫ్యామిలీతో కలిసి చిల్.. వీకెండ్‌లో అనసూయ సందడి.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook