Family Star Collections: సగం కూడా కష్టమే.. డిజాస్టర్ వైపు ఫ్యామిలీ స్టార్
Family Star: వరుసగా ఫ్లాప్ సినిమాలు అందుకుంటున్న విజయ్ దేవరకొండ తాజాగా తన ఆశలన్ని ఫ్యామిలీ స్టార్ సినిమా పైన పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా మాత్రం మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తాజా సమాచారం ప్రకారం ఇక ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్లో మరొక భారీ డిజాస్టర్ గా మారబోతోంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Vijay Devarkonda: విజయ్ దేవరకొండ హీరోగా తాజాగా విడుదలైన సినిమా ఫ్యామిలీ స్టార్. మంచి అంచనాల మధ్య ఈ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో చతకిలబడింది. విజయ్ ఖాతాలో ఈ సినిమా మరొక అతిపెద్ద డిజాస్టర్ గా మారడానికి సిద్ధమవుతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి సినిమా విడుదలకి ముందు నుంచే సినిమా పై హైప్ తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్లు కూడా తక్కువగానే ఉన్నాయి. పైగా మొదటి రోజు నుంచే సినిమాకి నెగటివ్ రివ్యూస్ వచ్చేయడంతో రెండవ రోజు నుంచి కూడా సినిమా కలెక్షన్లు పెద్దగా పుంజుకోలేదు.
ఇక వారాంతంలో కూడా ఈ సినిమా అంతంత మాత్రమే రాబట్టింది. సోమవారం రాగానే కలెక్షన్లు భారీ స్థాయిలో పడిపోయాయి. సినిమా ఆక్యుపెన్సీ కూడా 20 శాతానికి మించి పెరగలేదు. ఉగాది, రంజాన్ సెలవులు కూడా ఈ సినిమాకి పెద్దగా వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ఫ్యామిలీ స్టార్ సినిమా ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా రూ.15 కోట్ల షేర్ కలెక్షన్లు మించకపోవచ్చు. అయితే ఈ చిత్ర థియేట్రికల్ హక్కలు రూ 40 కోట్లు. అంటే రాబట్టాల్సిన మొత్తంలో సగం కలెక్షన్లు కూడా వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీన్ని బట్టే సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అవ్వబోతోంది అని చెప్పచ్చు. నైజాం, వైజాగ్ ఏరియాల్లో చిత్ర నిర్మాత దిల్ రాజే సొంతంగా సినిమాని రిలీజ్ చేశారు. మిగతా ఏరియాల్లో సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్ లకు భారీ నష్టాలు కలిగాయి. మరి దిల్ రాజు వారి నష్టాలు సెటిల్ చేస్తారో లేదో చూడాలి.
ఇక ఇప్పటికైనా విజయ్ దేవరకొండ తన పద్ధతి మార్చాలని, మంచి కంటెంట్ ఉన్న కథలని చేస్తే బావుంటుంది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ అలా జరగకపోతే ఇక విజయ్ దేవరకొండ ఇండస్ట్రీ లో ఉండటం కష్టమే అని వారు వాపోతున్నారు.
Also Read: Pawan Kalyan: జగన్‌లాంటి 'కోడిగుడ్డు' ప్రభుత్వం ఇంకా కావాలా? పవన్ కల్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook