Tollywood Love Stories:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రేమ కథలు ఎన్నిసార్లు వచ్చినా తీసే విధంగా తీస్తే…ఆ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు తప్పకుండా జేజేలు పలుకుతారు. స్వచ్ఛమైన ప్రేమకథలుగా వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అదే రూట్ ఫాలో అవుతూ మరో ఫీల్ గుడ్ గ్రామీణ ప్రేమ కథ మన ముందుకి రానుంది.


అచ్చమైన ప్రేమ కథను మనకు అందిస్తూ.. ప్రేమకు అర్థం చెప్పేలా ప్రస్తుతం ‘రాధా మాధవం’ అనే సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా చేస్తున్న ఈ సినిమాకి గోనాల్ వెంకటేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.


కాగా ఈ సినిమాకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించగా.. సతీష్ ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.


ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ అలానే ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ సినిమా సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. ఆహ్లాదకరమైన ప్రేమ కథ తో పాటు చక్కని సందేశాత్మక చిత్రం ఇది అని సెన్సార్ వారు ఈ సినిమా మీద ప్రశంసలు కురిపించారు.


మార్చి 1న ఈ మూవీ భారీ ఎత్తున తెలుగు భాషను విడుదల కానుంది. ఇక మున్ముందు మరిన్ని ప్రమోషనల్ కంటెంట్‌తో చిత్రయూనిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ తో పాటు మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, రవి శివతేజ, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు.


చైతు కొల్లి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి.. కెమెరామెన్ గా తాజ్ జీడీకే..ఎడిటర్ గా కే రమేష్మ వ్యవహరిస్తున్నారు.


Read More: Vijay Devarakonda - Family Star: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఫస్ట్ సింగిల్‌కు సూపర్ రెస్పాన్స్..


Read More: Praveen IPS: విడుదలైన ప్రవీణ్ ఐపిఎస్ ట్రైలర్.. ఫిబ్రవరి 16న థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమా..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook