Manchu Vishnu Kannappa: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న సినిమా ‘కన్నప్ప’. హై బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రంపై జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార ..ప్రభాస్ లాంటి సూపర్ స్టార్లు కూడా నటిస్తున్నారు. కాగా ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్రం మొదటి పోస్టర్‌‌ తో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. కాగా ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్నారు ఈ చిత్ర దర్శకుడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ చిత్ర షూటింగ్లో ఈ మధ్యనే మంచి విష్ణుకి చిన్న యాక్సిడెంట్ అయిన సంగతి కూడా తెలిసింది. ఇన్ని రోజులు ఈ చిత్ర షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతూ ఉంనింది. దాదాపు మూడు నెలల పాటు నిర్విరామంగా న్యూజిలాండ్ లో సాగిన ఫస్ట్ షెడ్యూల్ ముగిసిందని కన్నప్ప చిత్రయూనిట్ ప్రకటించింది. 


న్యూజిలాండ్‌, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన 600 మంది టెక్నీషియన్లు మ..ఆర్టిస్టుల తో  ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశామని మేకర్లు తెలిపారు. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు ఇండియాకు తిరిగి రానుంది. ఇక త్వరలోనే రెండు మూడు షెడ్యూలు ముగించి.. సినిమాని వచ్చే సంవత్సరం మధ్యలో విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారు ఈ చిత్ర నిర్మాతలు.


ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్టుగా మోహన్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా ట్వీట్ వేశారు. ‘న్యూజిలాండ్  లో 600 మంది హాలీవుడ్, మరియు భారతదేశంలోని అతిరధ మహారధులైన నటీనటులతో, థాయిలాండ్ మరియు న్యూజిలాండ్ సాంకేతిక నిపుణులతో, విష్ణు మంచు కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్రం 'కన్నప్ప'. 90 రోజుల మొదటి షెడ్యూల్ న్యూజిలాండ్ లోని అద్భుతమైన లొకేషన్స్ లో ఆ పరమేశ్వరుడు, షిర్డీ సాయినాథుని ఆశీస్సులతో  అనుకున్నది అనుకున్నట్టుగా దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వస్తున్నాం’ అని ప్రకటించారు.



విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్, మోహన్ బాబు, శివ రాజ్ కుమార్, ప్రభాస్ వంటి వారు నటిస్తున్నారు.  ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు.
పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ సినిమాని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మంచు విష్ణు నిర్మిస్తున్నారు.


Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు


Also read: Vitamin D: విటమిన్ డి ఎక్కువైతే ఏమౌతుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలెదురౌతాయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook