Happy Birthday Allu Sirish | నేడు మెగా హీరో అల్లు శిరీష్ పుట్టినరోజు (మే 30) సందర్భంగా అభిమానులకు అప్‌డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. యంగ్ హీరో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్రేమ కాదంట’. శిరీష్ బర్త్‌డే సందర్భంగా ప్రేమ కాదంట మూవీ టైటిల్‌, ఫస్ట్ లుక్ పోస్టర్లను రివీల్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నటుడు శిరీష్ తండ్రి, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు శిరీష్ 6వ సినిమా తెరకెక్కుతోంది. ప్రీ లుక్‌కు సైతం మంచి స్పందన లభించింది. నగరాలలో యువతీయువకుల మధ్య ఉండే రిలేషన్‌షిప్స్ ఆధారంగా ఈ సినిమా రాబోతోంది. అల్లు శిరీష్ (Actor Allu Sirish) బర్త్‌డే సందర్భంగా రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ప్రేమ కాదంట మూవీ యూనిట్ రివీల్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్లను గమనిస్తే విజేత, జతకలిసే సినిమాలను తెరకెక్కించిన రాకేష్ శశి ఈ మూవీకి దర్శకత్వం వహించగా, ఎం విజయ్ నిర్మతగా వ్యవహరించనున్నారు. అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి సంయుక్తంగా ప్రేమ కాదంట మూవీకి సంగీతం సమకూర్చనున్నారు. 


Also Read: Rashmi Gautam in Nagarjuna film: నాగార్జున సినిమాలో యాంకర్ రష్మీ గౌతమ్ 



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook