#GoLocalBeVocal | మెగా హీరో, అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ (Allu Sirish) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకనుంచి సాధ్యమైనంత వరకు స్వదేశీ ఉత్పత్తులు వాడాలని నిర్ణయించుకున్నాడట. విదేశీ ఉత్పత్తులు అసలు వాడకపోవడం అసాధ్యమని, కనుక వీలైనంత లోకల్ బ్రాండ్స్ వాడాలని సలహా ఇస్తూ వరుస ట్వీట్లు చేశాడు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు అల్లు శిరీష్. ఈ మెగా హీరోకు చాలా మంది నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. సైనిక లాంఛనాలతో సంతోష్ బాబు అంత్యక్రియలు.. వీరుడికి వీడ్కోలు
"వీలైనంత వరకు" అని స్పష్టంగా చెప్పాను. అయినా అతిగాల్లు కొందరు కిండల్ చేస్తూ ఉంటారు, చెప్పిన మంచి విషయాన్ని వదిలేసి. వాళ్ళని నేను లైట్ తీసుకుంటున్నా.#GoLocalBeVocal
— Allu Sirish (@AlluSirish) June 17, 2020
ఇలా విషయాలు చెబితే ట్రోల్ చేయడానికి, విమర్శించడానికి కొందరు ఉంటారు. కనుక మరో ట్వీట్‌లో అలాంటి అతిగాల్లకు సైతం ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు శిరీష్. ‘వీలైనంత వరకు" అని స్పష్టంగా చెప్పాను. అయినా అతిగాల్లు కొందరు కిండల్ చేస్తూ ఉంటారు, చెప్పిన మంచి విషయాన్ని వదిలేసి. వాళ్ళని నేను లైట్ తీసుకుంటున్నా. #GoLocalBeVocal’ అని శిరీష్ మరో ట్వీట్ చేశాడు. నిహారిక పెళ్లి ఫిక్స్.. క్లారిటీ అడుగుతున్న నెటిజన్లు
Here are some products I purchased at the supermarket. All Indian brands. Many of us use local products but don't like to admit as we think that makes us look less cool. It's time to break that myth. Let's not just buy local but be vocal abt it. I urge you all to #GoLocalBeVocal pic.twitter.com/PqUo9dSftP
— Allu Sirish (@AlluSirish) June 17, 2020
ఇదే విధంగా మొన్న సూపర్ మార్కెట్లో తాను కొన్న భారతీయ బ్రాండ్స్ సామాన్లను మరో ట్వీట్‌లో షేర్ చేసుకున్నాడు. మనలో చాలా మంది భారతీయ బ్రాండ్స్ ఉపయోగిస్తారు, కానీ ఆ విషయాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడరని శిరీష్ పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు అందుకు తగిన సమయం వచ్చిందని, భారతీయ బ్రాండ్స్ కొనాలని, ఆ విషయాన్ని పైకి చెప్పుకుందామని (#GoLocalBeLocal) అల్లు శిరీష్ పిలుపునిచ్చాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ