Actors who rejected Pushpa movie offer: టాలీవుడ్‌లోనే కాదు ప్రస్తుతం దేశమంతా పుష్ప (Pushpa Movie) మేనియా నడుస్తోంది. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్స్, డైలాగ్స్, మేనరిజం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా విడుదలై నెల రోజులు దాటినా ఇప్పటికీ పుష్ప ఊపు ఏమాత్రం తగ్గలేదు. విదేశీ క్రికెటర్లు సైతం స్టేడియంలో పుష్ప మేనరిజమ్స్‌ను అనుకరిస్తున్నారంటే... సినిమా క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప సూపర్ హిట్ అవడంతో దర్శక, నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకూ రూ.200 కోట్లు వసూలు చేసినట్లు చెబుతున్నారు. కరోనా వేళ ఒక తెలుగు సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం బాలీవుడ్‌ను (Bollywood) సైతం ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి ఈ సినిమా క్యాస్టింగ్‌కు ముందు అనుకున్న నటీనటులు వేరు.. ఫైనల్‌గా సెట్ అయిన నటీనటులు వేరు. ఒక స్టార్ హీరో, ఒక స్టార్ హీరోయిన్, ఒక స్టార్ యాక్టర్, ఇద్దరు బాలీవుడ్ బ్యూటీస్ ఈ సినిమాలో నటించే ఛాన్స్‌ను మిస్ చేసుకున్నారు. 'పుష్ప' ఫ్లవర్ అనుకుని లైట్ తీసుకున్నారు కానీ.. దాని ఫైర్ ఏంటో చూశాక.. ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకున్నామా అని వారు బాధపడుతుండొచ్చు. ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న నటీనటులెవరో ఇప్పుడు చూద్దాం...


[[{"fid":"220821","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


1) పుష్ప పాత్రకు ముందు అనుకున్నది 'మహేష్ బాబు'ని..


పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పోషించిన 'పుష్ప రాజ్' పాత్ర నిజానికి మహేష్ బాబు (Mahesh Babu) చేయాల్సింది. అయితే పుష్ప కథ తనకు సెట్ అవదు అనుకున్నాడో లేక డీగ్లామర్ పాత్రతో ప్రయోగం ఎందుకున్నాడో కానీ మహేష్ 'పుష్ప' సినిమాను వదులుకున్నాడు. మహేష్ రిజెక్ట్ చేయడంతో ఇదే కథతో సుకుమార్ అల్లు అర్జున్‌ను అప్రోచ్ అవడం... ఆ తర్వాత ప్రాజెక్ట్ పట్టాలెక్కడం జరిగిపోయింది.


[[{"fid":"220822","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


2)  హీరోయిన్‌గా సమంత చేయాల్సింది కానీ..


నిజానికి 'పుష్ప' సినిమాలో రష్మిక స్థానంలో సమంత (Samantha) హీరోయిన్‌గా నటించాల్సి ఉందనే రూమర్ ఉంది. శ్రీవల్లి పాత్రకు సమంత అయితేనే సూట్ అవుతుందని మేకర్స్ ఆమెను అప్రోచ్ అయ్యారని... అయితే సమంత రిజెక్ట్ చేయడంతో ఆ ఛాన్స్ రష్మిక మందన్నాకు దక్కిందనే ప్రచారం జరుగుతోంది.


[[{"fid":"220824","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


3) ఆ స్పెషల్ సాంగ్ ఛాన్స్ ఫస్ట్ దిశ పటానీకి..


పుష్ప సినిమాలోని 'ఉ అంటావా మావా.. ఉఊ అంటావా మావా...' సాంగ్ అందరినీ ఎంతగా ఉర్రూతలూగిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి ఈ సాంగ్‌లో నటించే ఛాన్స్‌ను మొదట బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి (Disha Patani) ఆఫర్ చేశారు. అయితే కారణాలేంటో తెలియదు కానీ.. దిశా పటానీ సెట్ కాకపోవడంతో సమంతతో ఈ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించారు.


[[{"fid":"220825","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


4) నోరా ఫతేహీని కూడా అప్రోచ్ అయ్యారు.. కానీ..


దిశా పటానీ తర్వాత పుష్ప మేకర్స్ మరో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీని (Nora Fatehi) కూడా అప్రోచ్ అయ్యారు. అయితే నోరా ఫతేహీ భారీ మొత్తాన్ని డిమాండ్ చేయడంతో మేకర్స్ వెనుకడుగు వేశారు. చివరకు సమంతను అప్రోచ్ అయి.. ఆమెను ఒప్పించగలిగారు.


[[{"fid":"220827","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


5) ఆ పాత్రకు ముందు విజయ్ సేతుపతిని అనుకున్నారు..


పుష్ప సినిమాలో 'ఫాహద్ ఫాజిల్' పోషించిన విలన్ పాత్రకు మొదట విజయ్ సేతుపతిని (Vijay Sethupathi) అనుకున్నారు. ఆ మేరకు అతన్ని అప్రోచ్ అయ్యారు. అయితే విజయ్ సేతుపతి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో చివరకు ఫహద్ ఫాజిల్‌నే ఫైనల్ చేశారు. ఈ పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ బెంగాలీ నటుడు జీషు సేన్ గుప్తా, టాలీవుడ్ నటుడు నారా రోహిత్‌లను కూడా అప్రోచ్ అయ్యారనే ప్రచారం ఉంది. 


Also Read: Oke Oka Jeevitham: 'ఒకే ఒక జీవితం' నుంచి హార్ట్ టచింగ్​ 'అమ్మ' సాంగ్​ రిలీజ్​


Also read: Khiladi Full Kicku Song: రవితేజ బర్తే డే సర్ ప్రైజ్.. ఖిలాడి సినిమాలోని ఫుల్ కిక్కు సాంగ్ రిలీజ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook