Khiladi Full Kicku Song: రవితేజ బర్తే డే సర్ ప్రైజ్.. ఖిలాడి సినిమాలోని ఫుల్ కిక్కు సాంగ్ రిలీజ్!

Khiladi Full Kicku Song: హీరో రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'ఖిలాడి' సినిమాలోని సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. మమత శర్మ ఆలపించిన 'ఫుల్ కిక్కు' అనే సాంగ్ ను విడుదల చేశారు. ఫిబ్రవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 05:32 PM IST
    • రవితేజ అభిమానులకు బర్త్ డే సర్ ప్రైజ్
    • ఖిలాడి సినిమా నుంచి ఫుల్ కిక్కు సాంగ్ రిలీజ్
    • దేవీశ్రీప్రసాద్ సంగీతం, నృత్యం సమకూర్చిన శేఖర్ మాస్టర్
Khiladi Full Kicku Song: రవితేజ బర్తే డే సర్ ప్రైజ్.. ఖిలాడి సినిమాలోని ఫుల్ కిక్కు సాంగ్ రిలీజ్!

Khiladi Full Kicku Song: సినీప్రియులకు ఫుల్‌ కిక్‌ అందిస్తానంటూ గణతంత్రదినోత్సవం రోజున దూసుకొచ్చారు కథానాయకుడు రవితేజ. మాస్‌ మహారాజ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'ఖిలాడి'. శరవేగంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో చిత్రబృందం జోరును పెంచేసింది. రవితేజ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని 'ఫుల్ కిక్కు' సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. 

రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమాలోని ఈ నాలుగో సాంగ్​ను విడుదల చేశారు. "ఫుల్‌ కిక్‌" అంటూ సాగే ఈ గీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా, సాగర్‌, మమత శర్మ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన ఈ మాస్‌ బీట్‌కు శేఖర్‌ మాస్టర్‌ సమకూర్చిన నృత్యాలు అలరిస్తున్నాయి.

పెన్ స్టూడియోస్‌, ఏ-స్టూడియోస్ ఎల్ఎల్పీ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డింపుల్‌ హయాతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్జున్‌, అనసూయ కీలక పాత్రలు పోషించారు. సత్యనారాయణ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ యెత్తున ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిందని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.  

Also Read: Ananya Pandey Photos: గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న అనన్య

Also Read: Radhe Shyam Release: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News