FNCC:FNCC 12వ ఆల్ ఇండియా టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన దర్శకులు బి.గోపాల్, డాక్టర్ కే.ఎల్.నారాయణ..
FNCC:ఎఫ్ ఎన్ సి సి 12వ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ ఘనంగా జరిగింది. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి ఎఫ్ ఎన్ సి సి మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ కే. ఎల్. నారాయణ మరియు డైరెక్టర్ బి. గోపాల్ చేతుల మీదగా బహుమతులు అందించారు.
FNCC:ఎఫ్ ఎన్ సి సి పన్నెండవ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ ఈ నెల 9 నుంచి 11 మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి ఛీఫ్ గెస్ట్స్‌గా ఎఫ్ ఎన్ సి సి మాజీ అధ్యక్షుడు డాక్టర్ కే. ఎల్. నారాయణ, డైరెక్టర్ బి. గోపాల్ పాల్గొన్నారు. అలానే ఎఫ్ ఎన్ సి సి సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ పెద్ది రాజు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి, కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, జె బాలరాజు, శైలజా జుజల, ఏడిద రాజా, సామా ఇంద్రపాల్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు. టోర్నమెంట్లో విన్నర్స్‌గా నిలిచిన నెస్ట్ ఇన్ టీం చెన్నై గ్రూప్, నవయుగ ట్రోఫీ మరియు క్యాష్ ప్రైస్ ని గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్ లో వివిధ రాష్ట్రాల నుంచి పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ కి మెయిన్స్ స్పాన్సర్ గా నవయుగ ఇంజనీరింగ్ వ్యవహరించింది.
ఈ టోర్నమెంట్ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కే.యల్.నారాయణ విషయానికొస్తే.. ఈయన తెలుగులో క్షణ క్షణం, హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాఖీ వంటి పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు కలయికలో వస్తోన్న ప్యాన్ వరల్డ్ మూవీకి ఈయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కాంబినేషన్ కోసం దాదాపు పుష్కరం క్రితమే సెట్ చేసారు. ఇప్పటికీ ఈ సినిమా సెట్ పైకి వెళుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు పూర్తి స్థాయిలో డ్యూయల్ రోల్లో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తంగా తన లైఫ్‌లో మెమరబుల్ మూవీతో రానున్నారు.
మరోవైపు దర్శకుడు బి.గోపాల్ విషయానికొస్తే.. తెలుగులో ఈయన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర వంటి ఇండస్ట్రీ హిట్ మూవీస్‌తో పాటు టాలీవుడ్ అగ్ర హీరోలందరితో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఘనత ఈయనకు దక్కుతోంది. అంతేకాదు తెలుగులో ఇప్పటి తరం హీరోలైన ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, గోపీచంద్ వంటి స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించారు.
Also read: Ujjwala Yojana Free Gas Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్..ఉచితంగా 75 లక్షల వంట గ్యాస్ సిలిండర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook