మూవీ రివ్యూ: 'గామి' (Gaami)
నటీనటులు: విశ్వక్‌సేన్, చాందిని చౌదరి, అభినయ, శాంతి రావు, మయాంక్ పరాక్, మహ్మద్ సమద్ తదితరులు..
సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి.సి.హెచ్
మ్యూజిక్: నరేష్
ఎడిటింగ్: రాఘవేంద్ర తిరున్
నిర్మాత: కార్తీక్ శబరీష్ తదితరులు..
దర్శకత్వం: విద్యాధర్ కాగిత


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ తొలిసారి అఘోరా పాత్రలో నటించిన సినిమా 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కినీ సినిమాలో  చాందిని చౌదరి మరో ముఖ్యపాత్రలో నటించింది. మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమాతో విశ్వక్ సేన్ హీరోగా హిట్ అందుకున్నాడా.. ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..


కథ విషయానికొస్తే..


శంకర్ ఓ అఘోర (విశ్వక్‌సేన్) తనలాంటి అఘోరాలతో కలిసి హరిద్వార్‌లో జీవిస్తూ ఉంటాడు. ఇతనికీ మానవ స్పర్శ తగిలితే మతి స్థిమితం కోల్పోయే లోపం ఉంటుంది.ఈ సందర్భంగా తోటి అఘోరాలతో కూడా కలిసి జీవించలేకపోతాడు. ఈ క్రమంలో తన లోపాన్ని నయం చేసే మాలి పత్రాలు హిమాలయాల్లోని ద్రోణగిరిలో ఉంటాయి. పుట్టగొడుగుల్లా ఉండే ఈ పత్రాలు ప్రతి 36 యేళ్లకి ఒకసారి మాత్రమే ఆ ప్రాంతంలో వికసిస్తూ ఉంటాయి. అలా వికసించిన మాలి పత్రాలు ఒక రోజు మాత్రమే శక్తిని కలిగి ఉంటాయి. ఈ సందర్భంగా శంకర్ హిమాలయాల్లోని ద్రోణగిరి చేరుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు. ఈ సందర్భంగా తాను అనుకున్నది సాధించాడా ? ఈ క్రమంలో చిన్నపాప ఉమతో పాటు భారత్, చైనా బార్డర్‌లో ఉండే హ్యూమన్స్ పై అనైతికంగా టెస్ట్ చేసే కేంద్రం ఉంటుది. అందులో ఓ 14 నుంచి 16 యేల్ల ఓ పిల్లాడు ఉంటాడు. ఈ ఇద్దరికి అఘోర శంకర్‌కు ఉన్న లింక్ ఏంటన్నదే 'గామి' మూవీ చూడాల్సిందే.   


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు విద్యాధర్ కాగిత గతంలో పలు యూబ్యూట్‌లో షార్ట్ వీడియోస్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇపుడు తనే స్వయంగా 'గామి' సినిమాను తెరకెక్కించాడు. అది కూడా మొదటి సారి మెగా ఫోన్ పట్టుకొని మాములు కథ తీస్తే సరిపోతుంది. కానీ ఈ సారి సబ్జెక్ట్ పై రీసెర్చి చేసి దైవత్త్వంతో పాటు ఊర్లో జరిగే దేవదాసి అనే మూఢ నమ్మకంతో పాటు.. సైన్స్ మూడు కలకలపి ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను తెరకెక్కించాడు. అంతేకాదు అఘోర పాత్ర చుట్టు కథ నడిపుతూనే.. సమాంతరంగా ఓ ఊర్లో ఉండే దేవదాసి కూతురు ఉమ.. మరోవైపు భారత్, చైనా బార్డర్‌లో మనషులపై అనైతకంగా టెస్ట్ చేసే ల్యాబలేటరీని చూపించాడు. మొత్తంగా ఒకే సినిమాలో దైవ శక్తి, మూఢ నమ్మకం, సైన్స్ కలగలపిన అంత్రాపాలజీ టైపులో ఈ సినిమాను తెరకెక్కించాడు. అఘోరా అనగానే బాలయ్య అఖండ టైపు మాస్ సినిమా కాకుండా.. క్లాస్ సినిమాగా సెన్సిబుల్‌గా తెరకెక్కించాడు. హీరోకు ఎందుకు మనిషి స్పర్ష తాగితే ఎందుకు తట్టుకోలేడనే విషయాన్ని ఇంకాస్త కన్విన్సింగ్‌గా చెబితే బాగుండేది. సినిమా కాస్త స్లోగా సాగినా.. ఈ మధ్య వస్తోన్న రొడ్డకొట్టుడు సినిమాలతో పోలిస్తే ఆకట్టుకుంటుంది. హిమాలయాల్లో విశ్వక్ సేన్, చాందిరీ చౌదరీలు పడే పాట్లను కూడా తెరపై చక్కగా ప్రెజెంట్ చేసాడు. గ్రాఫిక్స్ వర్క్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. కమర్షియల్ అంశాలకు దూరంగా ఉండటం ఈ సినిమాకు మైనస్ అని చెప్పాలి. మరోవైపు ఈ సినిమా చైనా బార్డర్‌లోని ల్యాబరేటరీలో పారిపోయేందకు హీరో చేసే ప్రయత్నాలు.. మనకు చిరంజీవి వేట సినిమా గుర్తుకు తెస్తోంది. అక్కడ కొన్ని సన్నివేశాల్లో హీరో దీపం వెలుగులో నేల కింద తవ్వుతూ ఉంటాడు. హీరో, ఇంకొ అతను ఇంత పనిచేస్తున్నా.. అక్కడి వాళ్లు అస్సలు కనిపెట్టారు.  పైగా వీళ్లకు దీపం.. అగ్గిపెట్టే ఎక్కడి నుంచి వచ్చాయనేది ప్రేక్షకులు లాజిక్ అడగొద్దు.  మొత్తంగా మహా శివరాత్రి కానుకగా వచ్చిన 'గామి' ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం బాగుంది.


నటీనటుల విషయానికొస్తే..
విశ్వక్‌సేన్ శంకర్ అనే అఘోరా పాత్రలో పర్వాలేదనిపించాడు. ఉన్నంతలో డిసెంట్ యాక్టింగ్ చేసాడు. చాందిని చౌదరి ఉన్నంతలో పర్వాలేదనిపించింది. చిన్న పిల్లగా నటించిన ఉమా పాత్ర..చైనా ల్యాబరేటరీలో ఉండే పిల్లాడు మంచి నటనే కనబరిచారు. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు ఓకే అనిపించారు.


ప్లస్ పాయింట్స్..


కథ


విశ్వక్ సేన్ నటన


స్క్రీన్ ప్లే


మైనస్ పాయింట్స్


కమర్షియల్ అంశాలు


లాజిక్ లేని సీన్స్


ఫస్టాఫ్ ల్యాగ్  


పంచ్ లైన్.. గామి.. ఆకట్టుకునే మంచి ప్రయత్నం..


రేటింగ్: 2.75/5


Also Read: Gaami Twitter Review: గామి ట్విట్టర్ రివ్యూ.. విజువల్ వండర్.. ఫిక్స్ అయిపోండి.. పక్కా హిట్..!  


Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter