Gadar 2 director comments on NTR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో బాలీవుడ్ తోపాటు వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యాడు జూ.ఎన్టీఆర్. దీంతో తారక్(NTR) తో సినిమా చేసేందుకు టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ దర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తేశాడు. రీసెంట్ గా హిందీలో రిలీజైన గదర్ 2 సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ 500 కోట్ల మార్క్‌ను కూడా క్రాస్ చేసింది. అనిల్ శర్మ(Anil Sharma) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సన్నీ డియోల్ లీడ్ రోల్ లో నటించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే గదర్-2 దర్శకుడు అనిల్ శర్మను ఓ ఇంటర్వ్యూలో సన్నీడియోల్‌ కాకుండా తారాసింగ్‌ పాత్రను నేటి తరం హీరోల్లో ఎవరు సమర్థవంతంగా పోషించగలరనుకుంటున్నారు? అని ఓ విలేకరు ప్రశ్నించాడు. “నాకు తెలిసి ఈ క్యారెక్టర్ ను చేయగల నటుడు బాలీవుడ్‌లో అయితే ఎవరూ లేరు. అనిల్ అక్కడితో ఆగకుండా సౌతిండియాలో మాత్రం జూ. ఎన్టీఆర్‌ తారాసింగ్‌ పాత్రకు అద్భుతంగా న్యాయం చేయగలడు'' అని చెప్పారు. లెజెండరీ డైరెక్టర్ నుండి ఇలాంటి కాంప్లిమెంట్ వచ్చిందంటే ఎన్టీఆర్ క్రేజ్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. 


Also read: Chandramukhi 2 Trailer: 'చంద్రముఖి 2' ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?


ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. విలన్ రోల్ ను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్  అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ మూవీని నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 


Also Read: Kushi Collections: రూ.50 కోట్ల క్లబ్ లో 'ఖుషి'.. కేవలం రెండు రోజుల్లోనే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook