Game Changer Pre Release Event: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కు ఇచ్చి పడేసిన పవన్ కళ్యాణ్..
Game Changer Pre Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయికుడిగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. దిల్ రాజ్ నిర్మాణంలో శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కించాడు. కియారా అద్వానీ, అంజలీ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో జరిగింది. ఈ వేడుకక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు పరోక్షంగా ఇచ్చిపడేసారు.
Game Changer Pre Release Event: గత కొన్ని రోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉన్నమెగా, అల్లు అర్జున్ మధ్య విభేదాలు మరోసారి అవును ‘గేమ్ ఛేంజర్’ వేదికగా బట్టబయలు అయ్యాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ అల్లు అర్జున్, రేవంత్ సహా ఇతరులను టార్గెట్ చేస్తూ సాగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకగా అల్లు అర్జున్ కు గట్టిగానే ఇచ్చి పడేసారు పవన్ కళ్యాణ్. ఎవరు ఎంత పై స్థాయికి వచ్చినా.. తమ మూలాలు మరిచిపోకూడదంటూ పరోక్షంగా అల్లు అర్జున్ కు చురకలు అంటించారు. ఎక్కడ నుండి వచ్చామో ఆ మూలాలు అసలు మరిచిపోకూడదన్నారు. నేను ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినా.. నాకు మూలాలు మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నుంచే వచ్చాయి.
మనం ఏ స్థాయికి వెళ్లినా మూలాలు మారచి పోకూడదంటూ రీసెంట్ గా అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు టైమ్ చూసి కొట్టాడు. గత కొన్ని రోజులుగా అల్లు కంపౌండ్ కు మెగా ఫ్యామిలీకి అంతగా పొసగడం లేదు. అది ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా.. సోషల్ మీడియాలో అభిమానులు బహిర్గతం అవుతున్నాయి. అల్లు అర్జున్.. తన ఫ్యాన్స్ ను అల్లు ఆర్మీ అంటూ మెగా ఫ్యామిలీని వేరు చేస్తూ మాట్లాడిన మాటలు మెగాభిమానులను మంటెక్కించాయి. దీనికి పవన్ కళ్యాణ్.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వేదికగా చేసుకొని డైరెక్ట్ గా పేరు చెప్పకుండా అల్లు అర్జున్ కు బాగానే గడ్డి పెట్టాడని మెగాభిమానులు సంబరపడిపోతున్నారు.
మరోవైపు పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ పట్ట వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. మొత్తంగా ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ వేడుకగా రాజకీయ, సినీ ఆరోపణ, ప్రత్యారోపణలకే సరిపోయింది. ఇటీవల జరిగిన పరిణామాలతో ఈవెంట్ కు రావాలా వద్దా అని ఆలోచించిన విషయాన్ని ప్రస్తావించారు. సినిమాటిక్కెట్ రేట్లు పెంపు పై కొన్ని డౌట్స్ ఉన్నాయి. డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా టిక్కెట్ రేట్లు పెంపు ఉంటుంది . టిక్కెట్ రేట్లు పెంపు తో ప్రభుత్వానికి 28 శాతం జీఎస్టీ వస్తుందనే విషయాన్ని ప్రస్తావించారు.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.