Game Changer 3rd Single: గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ టైటిల్ రోల్లో యాక్ట్ చేస్తోన్న బిగ్  బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ అంచ‌నాల మధ్య 2025లో రిలీజ్ అవుతున్న ఫస్ట్  పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సంక్రాంతి కానుకగా  జ‌న‌వ‌రి 10న రిలీజ్ కాబోతుంది. విడుద‌ల తేది ద‌గ్గ‌ర‌వుతున్న కొద్ది రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ జోడీ మ‌ధ్య కెమిస్ట్రీని దర్శకుడు శంక‌ర్ ఎంత గొప్ప‌గా తెర‌కెక్కించారోన‌ని ఫ్యాన్స్, ఆడియన్స్ ను  ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ‘నా నా హైరానా’ అనే  రొమాంటిక్ సాంగ్ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తెలుగులో ‘నా నా హైరానా’.. హిందీలో ‘జానా హైరాన్ సా’.. త‌మిళంలో ‘లై రానా’ అంటూ మెలోడీ ఆఫ్ ది ఇయ‌ర్‌గా ఈ సాంగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ ను ఫిదా చేయడం పక్కా అని చెప్పొచ్చు.


ఈ సాంగ్ ను  తెలుగులో రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాసారు. త‌మిళంలో వివేక్‌ రాయగా.. హిందీలో కౌశ‌ర్ మునీర్ రాశారు. ఈ పాట‌కు సంబంధించిన బీటీఎస్‌కు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలో  రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ జోడీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇది కదా శంకర్ నుంచి వచ్చే ఔట్ పుట్ అని చెప్పుకుంటున్నారు.


ప్రేమ‌లో ఉన్న హీరో హీరోయిన్లు ఒక‌రిపై ఒక‌రికి మ‌న‌సులోని ప్రేమ భావాలు ప‌దాల రూపంలో గ్లామరస్ గా  కూర్చారు. మేకింగ్ విష‌యానికి వ‌స్తే శంక‌ర్  పాట‌ల‌ను అద్భుతంగా పిక్చరైజ్ చేయడంలో తాను తోపు అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.  ఈ  సాంగ్ ను న్యూజిలాండ్‌తో పాటు  మన దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చిత్రీక‌రించ‌ని విధంగా రెడ్ ఇన్‌ఫ్రా కెమెరాతో పిక్చరైజ్ చేసారు.  ఒక్కో సీన్  ఒక్కో పెయింటింగ్‌లా విజువ‌ల్ బ్యూటీతో పాట మ‌న‌సుని హాయి గొలపుతోంది. మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నుకునేంత గొప్ప‌గా పాట‌లోని ప్ర‌తీ ఫ్రేమ్ ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఈ పాట‌ను ఫ్యూజ‌న్ మెలోడీ (వెస్ట్ర‌న్‌, క‌ర్ణాటిక్ కాంబో)గా ట్యూన్ చేయడం వివేషం. అలాగే బ‌ర్న్ట్ టోన్స్‌ను ఉప‌యోగించాడు.  రెండు మోనో టోన్స్‌ను ఓ స్టీరియో సౌండ్‌గా మార్చి ఈ పాట‌లో మిక్స్ చేయడం విశేషం.




సారెగ‌మ మ్యూజిక్ పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నగేమ్ చేంజ‌ర్ సినిమాలోని ఈ పాట‌ను శ్రేయా ఘోష‌ల్, కార్తీక్ ఆలపించారు. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీని అందించారు. తాజాగా  పాట విడుద‌ల‌య్యాక అందరి అంచ‌నాల‌ను మించి ఉంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ‘గేమ్ చేంజర్’ సినిమా నుంచి విడుద‌లైన‌ ‘జ‌ర‌గండి జ‌ర‌గండి’... ‘రా మ‌చ్చా రా.. ’ పాట‌ల‌కు మంచి  స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు రిలీజైన మూడో సాంగ్ ‘నా నా హైరానా’ ఈ అంచ‌నాల‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లిందనే చెప్పాలి.


ఈ మధ్యనే లక్నోలో విడుద‌ల చేసిన ‘గేమ్ చేంజర్’ టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చూపించ‌న‌టువంటి ఓ స‌రికొత్త అవ‌తార్‌లో శంక‌ర్ చూపించబోతున్నట్టు టీజర్ చూస్తే అర్ధమవుతోంది. ఇందులో చ‌ర‌ణ్ ప‌వ‌ర్‌ఫుల్ ఐఏఎస్ ఆఫీస‌ర్ పాత్ర చేయ‌టంతో పాటు స‌మాజానికి సేవ చేయాల‌నుకునే ఉత్సాహ‌వంతుడైన యువకుడి పాత్ర‌లోనూ క‌నిపించ‌నున్నారు. సినిమాలో హై రేంజ్ యాక్ష‌న్ సీన్స్.. పొలిటిక‌ల్ ఎలిమెంట్స్‌, ఆక‌ట్టుకునే క‌థ‌నం, న‌టీన‌టుల అద్భుత‌మైన ప‌నితీరు ఇవ‌న్నీ ప్రేక్ష‌కుల‌కు మెస్మరైజ్ చేయడం ఖాయం అంటున్నారు.  


ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.  ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేస్తోన్న  ఈ చిత్రంలో అంజలి,  శ్రీకాంత్, ఎస్‌.జె.సూర్య‌, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి, న‌వీన్ చంద్ర‌, సునీల్‌ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో యాక్ట్ చేశారు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ రోల‌ర్ కోస్ట‌ర్‌గా మూవీ అల‌రించ‌నుంది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన సంగతి తెలిసిందే కదా.


‘గేమ్ చేంజర్’ సినిమాను త‌మిళంలో ఎస్‌వీసీ, ఆదిత్య రామ్ మూవీస్ విడుద‌ల చేస్తున్నారు. హిందీలో ఏఏ ఫిల్మ్స్ అనీల్ త‌డానీ రిలీజ్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ 21న యు.ఎస్‌లోని డ‌ల్లాస్‌లో ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ క‌ల్లెప‌ల్లి ఆధ్వ‌ర్యంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. విదేశాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోబోతున్న ఫస్ట్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter