Ram Charan Dual Role: త్రిబుల్‌ ఆర్‌ తర్వాత గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన రామ్‌ చరణ్‌ తేజ చాలా కాలం తర్వాత 'గేమ్‌ ఛేంజర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ప్రేక్షకులతోపాటు అభిమానుల్లో రామ్‌ చరణ్‌ భారీగా అంచనాలు పెంచేశాడు. గతంలో విడుదలైన టీజర్‌.. తాజాగా ట్రైలర్‌ను గమనిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రామ్‌ చరణ్‌ రెండు పాత్రల్లో కనిపిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక పాత్రలో ఐఏఎస్‌ అధికారి పాత్రలో.. మరో పాత్రలో రైతుగా కనిపిస్తున్నాడు. అయితే వీరిద్దరూ అన్నదమ్ముళ్లుగా కనిపిస్తున్నారా? లేదా తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారా అనే చర్చ జరుగుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Game Changer Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరాచకం..ఆకట్టుకున్న గేమ్ చేంజర్ ట్రైలర్…అదే హైలైట్..!


ట్రైలర్‌ను గమనిస్తే ఐఏఎస్‌ అధికారిగా ఒక రామ్‌ చరణ్‌ కనిపిస్తున్నాడు. రెండో పాత్రలో రామ్‌ చరణ్‌ ఒక రైతుగా కనిపిస్తూనే రాజకీయ నాయకుడిగా కూడా కొన్ని సన్నివేశాల్లో కనిపించాడు. అభ్యుదయం పార్టీ అనే కార్యాలయం ప్రారంభించి రెండు చేతులు కలిపి పిడికిలి చూస్తూ ఆనందంగా రామ్‌ చరణ్‌ కనిపించాడు. ఒక కంపెనీని బెదిరించి వెళ్తున్న సన్నివేశం కూడా కనిపించింది. రైతు తరఫున పని చేసే రాజకీయ నాయకుడి పాత్రగా చెర్రీ కనిపిస్తున్నాడు. అంతేకాకుండా 'నా పార్టీ సేవ చేయడానికి కానీ సంపాదించడానికి కాదు' అని ఓ రాజకీయ ప్రసంగం రామ్‌ చరణ్‌ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: Game Changer: ఏపీకి తరలివెళ్లిన గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. అల్లు అర్జున్‌ వ్యవహారమే కారణం?


అవినీతికారుడైన బొప్పిలి మోపిదేవి అనే పాత్రలో ఎస్‌జే సూర్య ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నాడు. ప్రధానంగా రైతు పాత్రలో ఉన్న రామ్‌చరణ్‌.. ఐఏఎస్‌ అధికారి కూడా వీరిద్దరూ బొప్పిలి మోపిదేవితో పోరాడుతారని తెలుస్తోంది. రెండు పాత్రల్లో కనిపిస్తున్న రామ్‌ చరణ్‌లకు సంబంధం ఉందని చర్చ నడుస్తోంది. రైతు పాత్రలో ఉన్న రామ్‌ చరణ్‌కు భార్యగా అంజలి కనిపించింది. అంజలి చనిపోతూ ఐఏఎస్‌ అధికారిగా ఉన్న రామ్‌చరణ్‌కు జన్మనిచ్చిందా? లేదా వీరిద్దరూ అన్నదమ్ముళ్లా అనేది ఆసక్తికరంగా మారింది. పాత్రల మధ్య సంబంధంపైనే సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మరో చర్చ ఏమిటంటే ఏకంగా నాలుగు పాత్రల్లో రామ్‌ చరణ్‌ కనిపిస్తున్నాడని. విద్యార్థిగా.. రైతుగా.. ఐఏఎస్‌ అధికారిగా.. ఐపీఎస్‌ అధికారి పాత్రల్లో కనిపిస్తున్నట్లు కూడా మీమర్స్‌ చెబుతున్నారు.


కాగా ఈ సినిమా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ రాజమండ్రిలో ఈనెల 4వ తేదీన జరగనుండగా.. సినిమా 10వ తేదీన థియేటర్‌లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ వేడుకకు రామ్‌ చరణ్‌ బాబాయి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా రానున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారి సినిమా వేడుకకు వస్తుండడంతో భారీ ఎత్తున పవన్‌ కల్యాణ్‌ అభిమానులతోపాటు మెగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్‌ వ్యవహారంతో ఈ వేడుకకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.




ట్రైలర్ లింక్ ఇదే




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook