Gamma Awards: దుబాయిలో ఘనంగా గామా అవార్డ్స్ కర్టెన్ రైజర్…ట్రోఫీ లాంచ్ చేసిన సినీ సెలబ్రిటీస్
Gamma Awards Dubai: దుబాయ్‌లో ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ సమర్పిస్తున్న గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ అంగరంగ వైభవంగా త్వరలోనే జరగనుంది. ఈ అవార్డుల గురించి మరికొన్ని విశేషాలు మీకోసం..
Gamma Awards: తెలుగు వారి ముందుకి మరో ప్రతిష్టాత్మక అవార్డులు పండుగ రానుంది. వచ్చే నెల మార్చి మూడున దుబాయ్ లోని జబిల్ పార్క్ లో ప్రెస్టీజియస్ గా ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ సమర్పణలో ఘనంగా గామా అవార్డ్స్ వేడుక నిర్వహించనున్నారు. ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ సారధ్యంలో గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు గారు ఈ వేడుకను నిర్వహించబోతున్నారు.
శుక్రవారం ఈ వేడుకకు సంబంధించి కర్టెన్ రైజర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో జరపగా ఈ కార్యక్రమానికి జ్యూరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కోటి, నిర్మాత డీ వీ వీ దానయ్య, దర్శకులు సాయి రాజేష్, ప్రసన్న, జ్యూరీ సభ్యులు విఎన్ ఆదిత్య, హీరోయిన్ డింపుల్ హయతి,గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్, ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సుశీల్, ఫణి మాధవ్ కలిసి ఈ అవార్డుకు సంబంధించి ట్రోఫీను లాంచ్ చేశారు.
ఈ నేపథ్యంలో నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ.."గామా అవార్డ్స్ ఫౌండర్ కేసరి త్రిమూర్తులు గారు ఈ వేడుకను నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు.
ఈ సందర్భంగా ముందుగా సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.."గతంలో వైభవంగా నిర్వహించిన గామా అవార్డ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు కోవిడ్ తో పాటు ఇతర కారణాలతో కేసరి త్రిమూర్తులు గారు ఈ వేడుకను నిర్వహించలేకపోయారు. కానీ ఈసారి టాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించబోతున్నారు.
2021, 2022, 2023 లో విడుదలైన చిత్రాలనుంచి - బెస్ట్ మూవీ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ (మేల్, ఫిమేల్), బెస్ట్ యాక్టర్(మేల్, ఫిమేల్), బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సెలబ్రిటీ సింగర్, వంటి వివిధ కేటగిరీలకు అవార్డ్స్ అందజేయనున్నాం,” అని తెలియజేశారు.
దర్శకుడు విఎన్ ఆదిత్య మాట్లాడుతూ.."ఈ అవార్డుల జ్యూరీలో సభ్యుడిగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి త్రిమూర్తులు గారు నిర్వహిస్తున్న ఈ వేడుక తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు," అని అన్నారు.
రఘు కుంచే మాట్లాడుతూ.."దేశం కానీ దేశంలో తెలుగువారు గర్వపడేలా ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించడానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను" అని చెప్పారు.
గామా అవార్డ్స్ సీఈవో సౌరభ్ మాట్లాడుతూ.."
వేలాదిమంది తెలుగు, తమిళ, మళయాల సినీ ప్రేమికుల మధ్యలో ప్రెస్టేజియస్ గా ఈ వేడుక నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. నేషనల్ అవార్డ్ విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా టాలీవుడ్ ప్రముఖుల అందరిని ఈ వేడుకకు ఆహ్వానించాం" అని తెలియచేశారు.
Also Read: Samantha: సమంత ఫిట్‌నెస్ ఫ్రీక్.. ఓ రేంజ్‌లో ఉందిగా..
Also Read: Jaggery: ఖాళీ పొట్టతో ఉదయాన్నే బెల్లం తింటే ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook