Gangotri Fame Kavya Kalyan Ram: `గంగోత్రి` టు `బలగం` మధ్యలో `మసూద`.. స్పీడు మీదున్న కావ్యా కళ్యాణ్ రామ్
Gangotri Fame Kavya Kalyan Ram: గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది కావ్య కళ్యాణ్ రామ్. అయితే కావ్య ఇప్పుడు మెయిన్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టేస్తూ లక్కీ ఛార్మ్‌గా మారిపోయింది.
Gangotri Fame Kavya Kalyan Ram: సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఎవరికి దశ ఎలా తిరుగుతుందో చెప్పలేం. కొందరు బాల నటులుగా ఎంట్రీ ఇస్తారు. ఫుల్ ఫేమస్ అవుతారు. అయితే మళ్లీ హీరోలుగానో, హీరోయిన్లుగానో రాణిద్దామని ప్రయత్నిస్తారు. అందులో కొందరు సక్సెస్ అవుతారు. ఇంకొందరు ఫెయిల్ అవుతారు. శ్రీదేవీ, మీనా వంటి వారు చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా ఎంట్రీ ఇచ్చిన టాప్ హీరోయిన్లుగా ఎదిగారు.
ఈ తరంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చి హీరోయిన్లుగా నిలదొక్కుకునే వారి శాతం చాలా తక్కువ. ఈ క్రమంలోనే గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్యా కళ్యాణ్ రామ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట అంటూ ముద్దు ముద్దుగా కనిపించిన కావ్యా కళ్యాణ్ రామ్ ఇప్పుడు హీరోయిన్‌గా మెప్పిస్తోంది.
మసూద సినిమాలో కావ్యా కళ్యాణ్ రామ్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. కాస్త రొమాంటిక్ టచ్ ఉన్న పాత్రను పోషించి మెప్పించింది. ఇక బలగం సినిమాతో అందరినీ ఏడిపించింది. గ్లామర్‌గానే కాకుండా నటిగానూ మెప్పించింది. ఎమోషనల్ సీన్స్‌లో కావ్యా కళ్యాణ్ రామ్ అందరినీ ఆకట్టుకుంది.
వరుసగా రెండు హిట్లు పడటంతో కావ్యా కళ్యాణ్ రామ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మసూద, బలగం రెండు కూడా మోస్ట్ ప్రాఫిటబుల్ ప్రాజెక్టులుగా నిలిచాయి. అలా ఇప్పుడు కావ్యా కళ్యాణ్ లక్కీ హ్యాండ్‌గా మారింది. ఆమె ఉంటే సినిమా పెద్ద హిట్ అవుతుందని మేకర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కావ్యా కళ్యాణ్‌రామ్‌కు టాలీవుడ్ నుంచి పెద్ద పెద్ద ఆఫర్లు వస్తోన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే మళ్లీ తన అభిమానుల ముందుకు కావ్యా కళ్యాణ్ రామ్ రానుంది.
Also Read: Keerthy Suresh Pics : కీర్తి సురేష్ కూడా చూపించేస్తోంది.. మత్తెక్కించే చూపుల్తో రచ్చ.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook