Gangs Of Godavari OTT News: విశ్వక్ సేన్ సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ కథానాయకుడిగా సత్తా చూపెడుతున్నాడు. ఈ యేడాది 'గామి' మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో విశ్వ్‌క్‌సేన్ మనిషి స్పర్ష తట్టుకోలేని అఘోరా పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో నటించారు. పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చేలా ఉందని పబ్లిక్ చెప్పుకుంటున్నారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 650 పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. అందులో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో 500 స్క్రీన్స్‌లో రిలీజైంది.  ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది. దాదాపు రూ. 15 కోట్ల వరకు ఈ సినిమా ఐదు భాషలకు సంబంధించిన హక్కులు అమ్ముడు పోయినట్టు సమాచారం. ఈ సినిమాలో విశ్వక్‌సేన్ సరసన నేహా శెట్టి కథానాయికగా నటించింది. అంజలి మరో స్పెషల్ రోల్లో నటించింది. ఈ చిత్రంలో అయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 11 కోట్లు షేర్ రాబట్టాలి. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బిజినెస్ రూ. 8 కోట్ల వరకు ఉంది. ఈ సినిమాకు పోటీగా.. 'గం గం గణేషా', భజే వాయు వేగం వంటి మరో ఇద్దరు యువ హీరోల సినిమాలు పోటీలో ఉన్నాయి. ఈ పోటీలో ఈ సినిమా నెగ్గుకు రావాలంటే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావాల్సిందే. ఇక ఈ సినిమాకు ఓ మోస్తరు యావరేజ్‌గా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా ఏ మేరకు బాక్సాఫీస్ దగ్గర విజయం సాధిస్తుందనేది చూడాలి.


Read more: Cop cpr on monkey: హ్యాట్సాఫ్ సార్.. సీపీఆర్ చేసి కోతిని కాపాడిన పోలీసు.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter