Garikapati Comments on Naatu Naatu: ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతున్న గరికపాటి నరసింహారావు ఎక్కువగా సినిమా అంశాల మీద కూడా మాట్లాడుతూ హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో చిరంజీవితో పాటు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చిరంజీవి మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పెద్ద ఎత్తున గరికపాటి నరసింహారావు ని అందరూ టార్గెట్ చేసిన పరిస్థితి కనిపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తాజాగా గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ లను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ గురించి మాట్లాడిన ఆయన నిజంగా కవలలు కూడా ఇలా డాన్స్ చేయలేరేమో అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇది అచ్చ తెలుగు పాట అని పేర్కొన్న ఆయన ఎక్కడా ఒక్క ఇంగ్లీష్ పదం కూడా లేదని నాటు అనేది కూడా తెలుగు పదమే అని పేర్కొన్నారు.


నాటు మాంసం, నాటు కోడి, నాటు వైద్యం ఇలా తెలుగులో ఎన్నో పదాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన ఇంత చక్కగా పాట రాసిన చంద్రబోస్ కి నమస్కారం అని అన్నారు. ఇక నాటు నాటు పాటుకు ఆస్కార్ పురస్కారం రావాలని ఆకాంక్షిద్దామని పిలుపునిచ్చిన ఆయన చిన్నవాళ్ళైనా ఆ పాటకు పని చేసిన అందరికీ నమస్కారం పెడుతున్నానంటూ పేర్కొన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ లో ఉన్న ఈ నాటు నాటు సాంగ్ ఆస్కార్స్ కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే.


చంద్రబోస్ రచించగా కీరవాణి స్వరాలు అందించిన ఈ సాంగ్ కి రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ స్వరాలు అందించారు. మరికొద్ది గంటల్లో ఈ సాంగ్ కి ఆస్కార్ అవార్డు వరించిందా లేదా అనే విషయం మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మార్చి 12వ తేదీన ఈ అవార్డుల వేడుక జరగనున్నడంతో అందరిలోనూ ఇదే ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ అవార్డుల వేడుక కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ అంతా ప్రస్తుతానికి అమెరికాలోనే ఉన్న సంగతి తెలిసిందే.


Also Read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!


Also Read: Satish Kaushik Death: గర్భవతిగా ఉన్న నటిని వివాహం చేసుకుంటానన్న నటుడు మృతి.. అసలు ఏమైందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి