Satish Kaushik Death: గర్భవతిగా ఉన్న నటిని వివాహం చేసుకుంటానన్న నటుడు మృతి.. అసలు ఏమైందంటే?

Satish Kaushik Death Reason: ప్రముఖ హాస్య నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ గుండె పోటుతో ఈ రోజు తెల్లవారు జామున కన్నుమూశారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 9, 2023, 02:09 PM IST
Satish Kaushik Death: గర్భవతిగా ఉన్న నటిని వివాహం చేసుకుంటానన్న నటుడు మృతి.. అసలు ఏమైందంటే?

Satish Kaushik Passed Away: ప్రముఖ హాస్య నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ గుండె పోటుతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. సతీష్ కౌశిక్ ఆకస్మిక మరణంతో అందరూ షాక్ అయ్యారు. సతీష్ కౌశిక్ మృతదేహం గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్‌లో ఉండగా పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ముంబైకి తరలించనున్నారు. సతీష్ కౌశిక్ తన కెరీర్‌లో 100కి పైగా సినిమాల్లో నటించాడు. తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సతీష్ కౌశిక్ తన కుటుంబానికి కోట్లాది రూపాయల సంపదను అందించారు.

కొన్నేళ్లుగా, ఆయన తన డైరెక్షన్ సహా డైలాగ్ రైటింగ్‌తో అనేక మంది హృదయాలను గెలుచుకున్నాడు. ఇక జనవరిలో ZEE5లో విడుదలైన రకుల్ ప్రీత్ సింగ్ చిత్రం 'ఛత్రివాలి'లో అయన చివరి సరిగా కనిపించారు. సతీష్ కౌశిక్ హోలీ పండుగను జరుపుకోవడానికి ఢిల్లీకి వచ్చినట్లు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు చికిత్స చేసినప్పటికీ, ఆయనను రక్షించలేకపోయారని తెలుస్తోంది. ఈ క్రమంలో సతీష్ కౌశిక్ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.

ఇక సతీష్ కౌశిక్ మృతదేహం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముంబైకి చేరుకుంటుందని, ఆ తర్వాత ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారని భావిస్తున్నారు. కంగనా రనౌత్ రాబోయే చిత్రం 'ఎమర్జెన్సీ'లో ఆయన కనిపించనున్నారు. ఆయనకు  భార్య శశి కౌశిక్ కాకుండా, 11 ఏళ్ల కుమార్తె వంశిక కూడా ఉన్నారు. వంశిక 2012లో సరోగసీ ద్వారా జన్మించింది.

అంతకుముందు, మొదటి వివాహం సమయంలో ఆయనకు  ఒక కుమారుడు కూడా ఉన్నారు, అయితే ఆ బాబు 1996లో 2 సంవత్సరాల వయస్సులో మరణించాడు. బాలీవుడ్ నటి నీనా గుప్తాను పెళ్లి చేసుకుంటానని ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కోరాడు సతీష్. నీనా గుప్తా తన 'సచ్ కహూన్ తో' పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించింది. సతీష్ కౌశిక్ నీనాతో మాట్లాడుతూ 'బాధపడకండి, పుట్టే పిల్లవాడు నల్లటి చర్మంతో పుడితే, అది నా బిడ్డనే అని చెప్పండి, నేను పెళ్లి చేసుకుంటా, అప్పుడు ఎవరికీ ఏమీ అనుమానం ఉండదని అన్నారని వెల్లడించింది. 

Also Read: Ketika Sharma Photos: రొమాంటిక్ చూపులతో చంపేస్తున్న కేతిక శర్మ.. స్లిట్ కట్ డ్రెస్సులో హాట్ షో!

Also Read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News