Bhavani Ward Movie First Look Launch: ఆడియన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తూ భయపెట్టేందుకు రెడీ అవుతోంది భవానీ వార్డ్ మూవీ. గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీడీ నరసింహా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అవి క్రియేషన్స్, విభు ప్రొడక్షన్స్‌పై కళ్యాణ్ చక్రవర్తి, చంద్రకాంత్ సోలంకి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌ను  సోమవారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నరసింహ మాట్లాడుతూ.. తాను చెప్పిన స్టోరీని ఒప్పుకుని నటించిన గాయత్రి గుప్తాకు థాంక్స్ చెబుతున్నానని.. ఆమె ఎంతగానో సహకరించారని అన్నారు. హీరో అద్భుతంగా యాక్ట్ చేశారని.. అందరూ నటీనటుల సహకారంతో ఈ మూవీని బాగా తీశామన్నారు. ఈ మూవీ తప్పకుండా అందరికీ నచ్చుతుందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దర్శకుడు నరసింహ చెప్పిన కథ తనకు చాలా బాగా నచ్చిందని.. చిన్ని సినిమాలకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ మూవీ నిర్మించినట్లు నిర్మాత కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. అందరూ తమ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఈ మూవీని నరసింహా అద్భుతంగా తెరకెక్కించారని సీనియర్ నటి గాయత్రీ గుప్తా అన్నారు. టెక్నీకల్‌గా ఈ మూవీ చాలా బాగుంటుందని.. ఇలాంటి మంచి సినిమాలో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. హీరోహీరోయిన్స్ గణేష్ రెడ్డి, పూజా కేంద్రే మాట్లాడుతూ.. తమకు ఈ చిత్రంలో నటించేందుకు ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు. పీఆర్‌ఓ సాయి సతీష్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటీనటులంతా కూడా అద్భుతంగా నటించారని చెప్పారు. పీఆర్వోగా ఉన్న తనను నటుడిగా మార్చారని చెప్పారు. ఈ మూవీ పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు. 


Also Read: ITR Filing: ట్యాక్స్‌పేయర్స్‌కు బిగ్ అలర్ట్.. మీకు అలాంటి నోటీసు వచ్చిందా..?   


సాంకేతిక బృందం
==> బ్యానర్ :  అవి క్రియేషన్స్, విభు ప్రొడక్షన్స్
==> ప్రొడ్యూసర్స్: కళ్యాణ్ చక్రవర్తి, చంద్రకాంత్ సోలంకి
==> డైరెక్టర్: జీడీ నరసింహా
==> మ్యూజిక్: సోల్మోన్ రాజ్
==> బ్యాక్ గ్రౌండ్ స్కోర్: నిస్సి జస్టిన్
==> కెమెరామెన్: అరవింద్.బి
==> ఎడిటర్: అంగ నరేష్
==> PRO: సాయి సతీష్


Also Read: FD Interest Rates: ఎఫ్‌డీలపై అత్యధికంగా 9.50 శాతం వరకూ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి