Genelia tested Covid-19 positive 3 weeks ago: కరోనావైరస్ ( Coronavirus ) ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. సాధారణ ప్రజల నుంచి సినీ ప్రముఖులు, నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామందికి వైరస్ సోకింది. అయితే బాయ్స్.. బొమ్మరిల్లు బ్యూటీ.. ప్రముఖ సినీ నటి జెనీలియా (Genelia) కూడా కరోనా బారిన పడ్డారు. కోవిడ్ ఫలితం గురించి ఆమె సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె కరోనా  మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నట్లు పేర్కొన్నారు. మూడు వారాల క్రితం తనకు కరోనా సోకిందని.. గడిచిన 21 రోజుల్లో కరోనా లక్షణాలేవీ కనిపించలేదని.. శనివారం పరీక్ష చేయించుకోగా.. రిపోర్ట్ నెగెటివ్‌‌గా వచ్చినట్లు పేర్కొన్నారు. Also read: Samantha Pregnant: అప్పుడే గర్భవతి అయ్యాను.. కానీ: సమంత



ఈ వ్యాధితో పోరాడటం చాలా సులభమేనని.. అయినా.. 21 రోజులపాటు ఒంటరిగా గడపడం చాలా సవాల్‌గా అనిపించిందని పేర్కొన్నారు. ఈ సమయంలో డిజిటల్‌ ప్రపంచం ఒంటరితనాన్ని తన దరికి చేరనివ్వలేదని, మళ్లీ తన కుటుంబ సభ్యుల గడపడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. కరోనాను జయించాలంటే ముందుగా గుర్తించడం, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం, ఫిట్‌నెస్‌తో ఉండటం ఎంతో ముఖ్యమని జెనీలియా పేర్కొన్నారు. అయితే.. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న తరువాత జెనీలియా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమానులకు టచ్‌లో ఉంటుంది. అయితే.. రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.  Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర    Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు