Ghani Movie Release Date: వరుణ్ తేజ్ గని మూవీ విడుదల తేది ఫిక్స్.. ఈసారి పక్కా రిలీజ్!
Ghani Movie Release Date: హీరో వరుణ్ తేజ్ నటించిన కొత్త చిత్రం `గని` రిలీజ్ డేట్ ను చిత్రబృందం ప్రకటించింది. కరోనా ఆంక్షలు, పెద్ద సినిమాల రాక కారణంగా ఇన్ని నెలలు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు ఏప్రిల్ 4న విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.
Ghani Movie Release Date: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో నటించిన 'గని' మూవీ రిలీజ్ పై మేకర్స్ బుధవారం కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే అనేక సార్లు విడుదల వాయిదా పడుతున్న ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. గతేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా ఆంక్షలు, భారీ బడ్జెట్ చిత్రాల రిలీజ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సినిమాను సమ్మర్ లో కచ్చితంగా విడుదల చేసేందుకు నిర్ణయించుకుంది చిత్రబృందం. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన చేసింది. 'గని' సినిమాను వేసవిలో ఏప్రిల్ 4న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
ఈ మూవీలో హీరో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం వరుణ్ తేజ్ సిక్స్ ప్యాక్ చేసి.. బాక్సింగ్ ప్రొఫెషనల్‌గా కనిపించాలనే ఉద్దేశంతో అమెరికాకు వెళ్లి శిక్షణను తీసుకున్నారు. హాలీవుడ్ మూవీ 'టైటాన్స్', బాలీవుడ్‌లో 'సుల్తాన్' వంటి చిత్రాలకు యాక్షన్ సీన్స్ డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఈ చిత్రానికి యాక్షన్ సన్నివేశాలను రూపొందించడం విశేషం.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ నటించారు. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నదియా, నరేశ్, తనికేళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని అల్లు అరవింద సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.
అనేక సార్లు విడుదల వాయిదా..
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'గని' చిత్రాన్ని.. గతేడాది డిసెంబరులోనే విడుదల కావాల్సిఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా గతేడాది జులై, నవంబరు నెలల్లోనే రిలీజ్ చేయాలని భావించినా.. కరోనా ఆంక్షల కారణంగా వెనక్కి తగ్గింది. ఆ తర్వాత గతేడాది డిసెంబరులో విడుదల చేస్తామని ప్రకటించినా.. ఆ సమయంలో 'పుష్ప', 'అఖండ', 'శ్యామ్ సింగరాయ్' చిత్రాలు అప్పటికే బరిలో ఉన్నాయి.
ఆ తర్వాత సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' వంటి పాన్ ఇండియా చిత్రాలు రేసులో ఉన్నాయి. ఫిబ్రవరిలో 'భీమ్లా నాయక్' సినిమా రిలీజ్ ఉండడం వల్ల మరోసారి వాయిదా వేసిన చిత్రబృందం ఇప్పుడు 'గని' మూవీని ఏప్రిల్ లో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తామని వెల్లడించారు.
Also Read: Adipurush Release Date: ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
Also Read: Bheemla Nayak Collection: రూ.100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook