Thalapathy Vijay Remuneration:  కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తాజాగా నటిస్తున్న చిత్రం గోట్. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం వేగంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇక ప్రమోషన్ లో భాగంగా పలు విషయాలను పంచుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా కథ రాసుకునేటప్పుడు ముందుగా రజినీకాంత్ తండ్రిగా ధనుష్ కొడుకుగా వారిద్దరిని నటింపచేయాలని డైరెక్టర్ అనుకున్నారట. కానీ డీ ఏజింగ్ యాప్ ఉపయోగించి ఒక నటుడితోనే తండ్రి, కొడుకు క్యారెక్టర్లు వేయించవచ్చని అనుకున్న వెంకట్ ప్రభు విజయ్ ని తీసుకోవడం జరిగింది. అలా విజయ్ కి ఈ అవకాశం లభించింది. 


ఇకపోతే గాంధీ క్యారెక్టర్ లో తండ్రిగా,  జీవన్ క్యారెక్టర్ లో కొడుకుగా విజయ్ చాలా అద్భుతంగా నటించినట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్న ఈయన పారితోషకం పై వార్తలు వైరల్ గా మారాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సల్మాన్ ఖాన్ , ప్రభాస్ లను మించిపోయి మరీ పారితోషకం తీసుకోబోతున్నారు అంటూ సమాచారం. 


సాధారణంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోలుగా సల్మాన్ ఖాన్,  ప్రభాస్ పేరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కూడా రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. ఇప్పుడు వీరిని మించి విజయ్ రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా రూ.200 కోట్లు పారితోషకం తీసుకుంటున్నారట.నిజానికి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇదే అత్యధిక పారితోషకం అని చెప్పవచ్చు.. ఇప్పటివరకు ప్రభాస్ రూ.150 కోట్లు,  సల్మాన్ ఖాన్ రూ .125 కోట్లు మాత్రమే తమ సినిమాలకు తీసుకున్నారు. అయితే విజయ్ ఒక్కసారిగా రెట్టింపు స్థాయిలో పారితోషకం తీసుకుంటూ ఉండటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  దీనికి తోడు ఇదే ఈ చివరి సినిమా అని,  ఇక ఆయన రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారని సమాచారం.


Also Read: No Selfies: తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక! జలాశయాల వద్ద సెల్ఫీలు.. ఫొటోలు వద్దు


Also Read: Narendra Modi: తెలంగాణలో వరదలపై ప్రధాని మోదీ ఆరా.. అండగా ఉంటామని భరోసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter