God Father Release: సల్మాన్ ఖాన్ దెబ్బకు దిగొచ్చిన గాడ్ ఫాదర్ టీం..అంతా సెట్!
God Father Issue Cleared and all set to Release on October 5th: గాడ్ ఫాదర్ సినిమా విడుదల విషయంలో నెలకొన్న టెన్షన్స్ అన్నీ క్లియర్ అయ్యాయని, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నారని తెలుస్తోంది.
God Father Issue Cleared and all set to Release on October 5th: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా విడుదల ఉంటుందా లేదా అనే విషయం మీద చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే సినిమా నుంచి విడుదల చేస్తామని చెప్పిన ఫస్ట్ సింగిల్ 15వ తేదీ విడుదల చేయాల్సి ఉంది, కానీ 19వ తేదీ వచ్చినా ఇంకా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన విడుదలవుతుందని, అనంతపురం బస్టాండ్ పక్క కాలేజీ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ రోజు నుంచి వరుసగా మూడు పాటలను విడుదల చేయడానికి టీం అంతా సిద్ధం చేసుకుందని, 25వ తేదీన ట్రైలర్ కూడా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. అలాగే సల్మాన్ ఖాన్ హిందీ రిలీజ్ హోల్ లో పెట్టారని కూడా వార్తలు వచ్చాయి.
నిజానికి సల్మాన్ ఖాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనంతపురం కూడా వస్తానని సినిమా యూనిట్ కి హామీ ఇచ్చారట, కానీ సినిమా యూనిట్ ప్రమోషన్స్ విషయంలో అలసత్వం వహించడంతో ఆయన అనంతపురం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే విషయాన్ని అలాగే సినిమా విడుదల విషయాన్ని కూడా హోల్డ్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా అదేమీ నిజం కాదని హిందీ విడుదల కూడా కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. తెలుగు శాటిలైట్ మినహా మిగతా మార్కెటింగ్ అంతా పూర్తయిందని, ఈ సినిమా ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేటు పెట్టి కొనుక్కుందని తెలుస్తోంది.
మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. మోహన్ రాజా డైరెక్షన్లో కొణిదెల ప్రొడక్షన్స్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద ఎన్వి ప్రసాద్, ఆర్బి చౌదరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాథ్, సముద్రఖని వంటి వారు కీలక పాత్రలలో కనిపించారు. ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని జరుగుతున్న ప్రచారం ఇక ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడినట్టే చెప్పాలి. అయితే మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకోబోతోంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
Also Read: Jr NTR sings Kiss Me: కొమురం భీముడితోనే కామెడీలా.. మరీ ఇలా ఉన్నారేంట్రా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి