Directors attacking Websites: ప్రమోషన్స్ చేసిన వెబ్ సైట్లే చెత్త వెబ్ సైట్లు.. అలా టార్గెట్ చేస్తున్న డైరెక్టర్లు!

Directors attacking Movie Websites through Movies: తమ సినిమాలను ఏ వెబ్సైట్స్ లో అయితే ప్రమోట్ చేసుకుంటున్నారో దర్శకులు అదే వెబ్ సైట్ లను తమ సినిమాల ద్వారానే టార్గెట్ చేస్తున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 18, 2022, 06:14 PM IST
Directors attacking Websites: ప్రమోషన్స్ చేసిన వెబ్ సైట్లే చెత్త వెబ్ సైట్లు.. అలా టార్గెట్ చేస్తున్న డైరెక్టర్లు!

Directors attacking Movie Websites through Movies: ఇటీవల మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో రూపొందిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దర్శకుడు తాను చెప్పాలనుకున్న విషయాలను సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. హీరో సుధీర్ బాబు సినిమాలో నవీన్ అనే దర్శకుడు పాత్రలో నటించాడు. సుమారు 5 వరుస హిట్ సినిమాలతో దూసుకు వెళుతున్న నవీన్ ఒక అమ్మాయిని చూసి ఆమెనే తన హీరోయిన్గా చేయాలని భావించి అనేక ప్రయత్నాలు చేయడం వంటి ఆసక్తికరమైన కథనంతో సినిమా మొత్తాన్ని నడిపించాలని చూశారు.

కానీ ఈ సినిమా పెద్దగా వర్క్ ఔట్ అవలేదు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చాలా సున్నితమైన సినిమాలు చేస్తాడని పేరున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమా ద్వారా కొన్ని సినిమా వెబ్ సైట్స్ మీద తమ అక్కసు వెళ్ళగక్కే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కో డైరెక్టర్ పాత్రలో కనిపిస్తాడు. ఆ పాత్ర ద్వారా కొన్ని సినిమా వెబ్సైట్లను చెత్త వెబ్సైట్లు అనిపించే ప్రయత్నం చేశారు మోహనకృష్ణ ఇంద్రగంటి.

అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తమ సినిమా ముహూర్తం మొదలు సినిమా విడుదలైన తర్వాత రివ్యూ వచ్చేవరకు అందులో ఏ అప్డేట్ రాకపోయినా వెంటపడి మరి రాయించుకుంటూ ఉంటారు. అలాంటిది సినిమాలో మాత్రం వాటి మీద సెటైర్లు వేస్తుంటారు. నిజానికి సినిమా బాగుంటే ఎలాంటి వెబ్సైట్ బాలేదని రాసినా సదురు వెబ్సైట్ ను ప్రేక్షకులు విమర్శిస్తారే తప్ప సినిమా చూడటం మానేయరు.  

వెబ్సైట్లో వచ్చే రివ్యూలు కేవలం ఒక అంచనాకు వచ్చేందుకు మాత్రమే ప్రేక్షకులు ఉపయోగిస్తారు అన్నది ఎవరూ  కాదనలేని వాస్తవం. ఇప్పుడు ఎక్కువగా ప్రేక్షకులు వెబ్సైట్ రివ్యూలను నమ్మకుండా తమకు తెలిసిన వారు సినిమా చూస్తే వారి మౌత్ టాక్ ద్వారా సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని గ్రహించి తాము సినిమా చూడాలా లేక ఓటీటీలో వస్తే ఫ్యామిలీతో కలిసి చూడాలా అనే విషయాన్ని నిర్ధారించుకుకుంటున్నారు.

అలాంటప్పుడు వెబ్సై ట్లో బాగున్న సినిమాని బాలేదని ఎవరూ రాయరు. ఒకవేళ అలా రాసినా దాన్ని ప్రేక్షకులు నమ్మరు. వెబ్సైట్లో ఒక రివ్యూ పోస్ట్ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా వారి వారి పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశంగా నిర్వాహకులు భావిస్తూ ఉంటారు. బాగున్న సినిమాలు బాలేదని దాదాపుగా ఎవరూ రాయరు కానీ సినీ దర్శకులలో కొంతమంది తమ సినిమాలను ప్రమోట్ చేసే  వెబ్సైట్స్ మీద సెటైర్లు వేస్తూ ఉన్నారు. ఇటీవల పక్కా కమర్షియల్ సినిమాల్లో దర్శకుడు మారుతి కూడా ఇలాగే వెబ్సైట్ల మీద కౌంటర్లు వేశారు. వీరి ప్రమోషన్స్ కోసం ఏ వెబ్సైట్ మీద ఆధారపడతారో తమ గురించి కొంచెం నెగిటివ్గా రాస్తే అదే వెబ్సైట్స్ ను చెత్త వెబ్సైట్ అనడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు. ఈ పద్ధతి మార్చుకోవాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Krithi Shetty Disasters: మూడు హిట్లు-మూడు డిజాస్టర్లు.. కృతికి బాడ్ టైం స్టార్ట్స్!

Also Read: Samantha Ruthprabhu Skin Issues: ఆ వ్యాధితో ఇబ్బంది.. చికిత్స కోసం అమెరికాకు సమంతా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News