God Father Movie to Release on Malayalam Also: మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన తెలుగులో గాడ్ ఫాదర్ పేరిట రీమేక్ చేస్తున్నారు. గతంలో హనుమాన్ జంక్షన్ లాంటి సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించిన మోహన్ రాజా ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాని రూపొందిస్తున్న నేపద్యంలో కేవలం తెలుగు వర్షన్ లోనే సినిమా విడుదలవుతుందని భావించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తర్వాత సినిమాలో సల్మాన్ ఖాన్ భాగమైన తర్వాత హిందీలో కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మలయాళ భాషలో సినిమాని విడుదల చేస్తున్నట్లుగా ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అధికారికంగా ఈ పోస్టర్ను కొణిదల ప్రొడక్షన్ సంస్థ కానీ సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ గాని షేర్ చేయలేదు కానీ సినిమా యూనిట్ నుంచి ఈ పోస్టర్ బయటకు వచ్చిందనే ప్రచారం ఊపందుకుంది.


అంతేకాక ప్రస్తుతానికి తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాని తమిళ, కన్నడ భాషలో కూడా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో మలయాళంలో స్టార్ హీరోయిన్గా ఉన్న నయనతార హీరోయిన్గా నటించింది. ఆమె ఒక కీలక పాత్రలో నటించింది. మలయాళంలో కూడా ఓపెనింగ్స్ రావచ్చనే ఉద్దేశంతో మలయాళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు.  అలాగే ఎలాగో మూడు భాషల్లో విడుదల చేస్తున్నారు కదా అని తమిళ, కన్నడ భాషలో కూడా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.



ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్ వంటి వారి కీలకపాత్రలలో నటించారు. అలాగే తెలుగు హీరో సత్యదేవ్, నయనతార భర్త పాత్రలో నటిస్తుండగా మెగాస్టార్ అనుచరుడి పాత్రలో సునీల్ నటిస్తున్నారు. అయితే ఒక మళయాలం సినిమాని తెలుగులో రీమేక్ చేసి మళ్లీ దాన్ని డబ్బింగ్ చేసి మలయాళంలో రిలీజ్ చేయడం అనే విషయం మీద మాత్రం పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. అసలు ఇది లాజిక్ ఉండే చేస్తున్నారా? బుర్ర ఉండే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా అంటూ నిర్మాణ సంస్థల మీద మెగాస్టార్ అభిమానులు తెలుగు సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరి ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది సినిమా టీం అధికారికంగా ప్రకటిస్తే గాని ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తుంది సినిమా యూనిట్. ప్రస్తుతానికి  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రౌండ్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.


Also Read: Prabhas Maruthi Movie: ప్రభాస్ -మారుతి సినిమాలో బాలీవుడ్ హీరో.. పెద్ద ప్లానే ఇది!


Also Read: Raghavendra Rao on Name Change: హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గుపడుతోంది, కన్నీరు పెడుతోంది.. పేరు మార్పుపై రాఘవేంద్రరావు స్పందన!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook