Juice for Premature Greying Hair: తెల్ల వెంట్రుకలు వయస్సురీత్యా వస్తాయి. కొంతమందికి 20 వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఇది హార్మోన్ మార్పుల వల్ల సరైన జీవన శైలి పాటించకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. దానికి ఎలాంటి అద్భుత శక్తి ఈ భూమిపైన లేదు. కానీ కొన్ని రకాల ఖనిజాలు చేర్చుకోవడం వల్ల వెంట్రుకలు తెల్లబడడానికి నిలిపివేయవచ్చు. అయితే ముఖ్యంగా విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉండే జ్యూసులు తాగడం వల్ల తెల్ల వెంట్రుకలు తగ్గిపోతాయి.
పాలకూర..
పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కుదుళ్లకు జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తుంది. ఐరన్ లేమితో బాధపడేవారికి తెల్ల వెంట్రుకలు వస్తాయి. ఇలాంటివారు పాలకూరను తమ డైట్ లో చేర్చుకోవాలి.
క్యారెట్లు..
క్యారెట్ లో బీటాకెరోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది విటమిన్ 'ఏ' లా మారుతుంది. విటమిన్ ఏ సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కుదుళ్లను ఆరోగ్యంగా పొడిబారకుండా కాపాడుతుంది. జుట్టు తెల్లబడటాన్ని నియంత్రిస్తుంది.
బీట్రూట్..
బీట్‌రూట్ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుచ్చికలంగా ఉంటాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. బీట్‌రూట్‌జుట్టు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. పిగ్మెంటేషన్ రాకుండా నివారిస్తుంది. తెల్ల వెంట్రుకలు కనిపించకుండా చేస్తుంది.
ఉసిరి..
ఉసిరిలో విటమిన్ సి కు పవర్ హౌస్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేద పరంగా జుట్టు ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. ఉసిరి వెంట్రుకలు తెల్లబడటానికి బాలనెరుపును నివారించి, నేచురల్ పిగ్మెంటేషన్ ప్రాసెస్ కు సహాయపడుతుంది.
అల్లం...
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కుదుళ్ల మంచి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి తెల్ల వెంట్రుకలు రాకుండా నివారిస్తుంది.
ఇదీ చదవండి: యాలకులతో జుట్టు, చర్మానికే కాదు ఆరోగ్యానికి కూడా 7 ప్రయోజనాలు అవి ఏంటో తెలుసా?
నిమ్మకాయ..
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడి ఐరన్ గ్రహించడానికి సహకరిస్తుంది. ఈ సీట్రస్ పండ్లు జుట్టు ఆరోగ్యానికి సహకరిస్తాయి. తెల్లగా పడటానికి నివారిస్తాయి.
పుదీనా ఆకులు..
పుదీనా మంచి రిఫ్రేష్మెంట్ ఇస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి నివారించి వెంట్రుకలు తెల్లబడటానికి తగ్గిస్తుంది.
ఇదీ చదవండి: ఉదయం పరగడుపున ఇలా తులసి నీరు తాగితే 5 రోగాలు మీ దరి చేరవు
కొబ్బరి నీరు..
కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇది శరీర ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. ఇది హైడ్రేషన్ కు నిర్వహిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు కూడా కొబ్బరినీరు సహాయపడుతుంది. కుదుళ్లు పొడిబారకుండా కాపాడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి