Nandini Reddy: తీవ్ర దుఃఖంలో మునిగిన ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి

Lady Director Nandini Reddy Sister Shanthi Demised: మొన్న ప్రముఖ నిర్మాతల నివాసంలో విషాదం చోటుచేసుకోగా.. తాజాగా దర్శకురాలి నివాసంలో విషాదం అలుముకుంది. ఆమె కుటుంబంలో విషాదం చోటుచేసుకోవడంతో సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 10, 2024, 06:24 PM IST
Nandini Reddy: తీవ్ర దుఃఖంలో మునిగిన ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి

 Nandini Reddy: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. తన సోదరి మృతి చెందడంతో ప్రముఖ దర్శకురాలు తీవ్ర విషాదంలో మునిగింది. సోదరి మృతి విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూ తీవ్ర దుఃఖితురాలైంది. దీంతో ఆమెకు ధైర్యం చెబుతూ సినీ రంగాలు ప్రముఖులు సందేశం ఇస్తున్నారు. సోదరి మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

Add Zee News as a Preferred Source

Also Read: OTT Releases: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీలో వచ్చేసింది, ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

తెలుగు సినీ పరిశ్రమలో మహిళా దర్శకులు చాలా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. వారిలో ఒకరు నందినీ రెడ్డి. అడపాదడపా సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు వినోదం అందిస్తున్న నందినీ రెడ్డి జీవితంలో విషాదం అలుముకుంది. ఆమె సోదరి శాంతి కొద్దిసేపటి కింద కన్నుమూసింది. క్యాన్సర్‌తో పోరాడుతూ ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని నందినీ రెడ్డి పంచుకోకపోయినా ఆమె రాసిన సందేశం ద్వారా తెలుస్తోంది. సోదరితో ఉన్న అనుబంధం, ఆత్మీయతను నందినీ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుని తీవ్రంగా రోదించారు.. ఈ సందర్భంగా తన సోదరి ఫొటోను పంచుకుంటూ ఆవేదనకు గురయ్యారు.

Also Read: BB4: నాల్గోసారి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్.. అఫీషియల్ ప్రకటన..

'ఆత్మీయులను కోల్పోవడం చాలా సులభం కాదు. నాతో కలిసి పెరిగిన వారిలో ఒకరిని దూరం చేసుకోవడం ఇదే తొలిసారి. నన్ను తొలిసారిగా అక్కా అని పిలిచింది శాంతినే. ఆమె చాయా దయార్ధ కలిగిన వ్యక్తి, కల్మషం లేని ఆమె నవ్వు ఆమెకు అత్యంత బలమైన విషయం నవ్వు అని నమ్ముతా. అదే బలంతో అదే చిరునవ్వుతో ఒక పెద్ద యుద్ధంతో శాంతి పాల్గొంది' అని నందినీ రెడ్డి పంచుకున్నారు.

'నాలుగు నెలల నుంచి ఎంతో కష్టపడి పోరాడుతోంది. ఈరోజు ఆమెకు సమయం వచ్చేసింది. ఆమె ఒక ఉత్తమ కుమార్తె, సోదరి, ఉత్తమ భార్య, ఉత్తమ తల్లి, ఉత్తమ స్నేహితురాలి. నా ప్రియమైన చెల్లెలా నిన్ను ఎప్పుడూ మిస్సవుతూనే ఉంటాం' అని నందినీ పంచుకుంటూ తన సోదరి శాంతి ఫొటోను షేర్‌ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఆమెకు సానుభూతి ప్రకటిస్తూ.. శాంతి మృతికి నివాళులర్పిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న నందినీ స్నేహితులు, ఆత్మీయులు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. మరింత క్లోజ్‌ వ్యక్తులు ఆమె ఇంటికి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

 
 
 
 
 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News