Gogineni Prasad Passed Away: ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో వరుస మరణాలు వెంటాడుతున్నాయి. రెండు రోజుల కిందట మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సోదరి అనారోగ్యం కారణంగా మృతి చెందగా.. అంతకు ముందు 'జైలర్' చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటుడు, దర్శకుడు జి.మారి ముత్తు కన్నుమూశారు. ఇలాంటి వరుస విషాదాలతో మూవీ ఇండస్ట్రీ కోలుకోక ముందే ఇప్పుడు టాలీవుడ్ నిర్మాత కన్నుమూశారు. తెలుగు సినీ పరిశ్రమలో అనేక చిత్రాలు నిర్మించిన ఒకప్పటి నిర్మాత గోగినేని ప్రసాద్ అనారోగ్యంతో మరణించారు. 'ఈ చరిత్ర ఏ సిరాతో', 'శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం' వంటి చిత్రాలతో పాటు నందమూరి బాలకృష్ణతో 'పల్నాటి పులి' సినిమాని రూపొందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కారణం ఏంటి?
బుధవారం సాయంత్రం కన్నుమూసిన తెలుగు నిర్మాత గోగినేని ప్రసాద్.. వయోభారం కారణంగా గత కొంతకాలంగా సినిమాలను దూరంగా ఉంటున్నారు. 73 ఏళ్ల వయసున్న నిర్మాత.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కొండాపూర్ తన నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వారు వెల్లడించారు. 
టాలీవుడ్ నిర్మాత గోగినేని ప్రసాద్ కు ఓ కుమారుడు ఉన్నారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారు. గురువారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ప్రసాద్ అంత్యక్రియలను నిర్వహించారు. నిర్మాత గోగినేని ప్రసాద్ మృతి పట్ల సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Chandrababu Arrest: చంద్రబాబుకు మళ్లీ నిరాశ, బెయిల్‌పై విచారణ వాయిదా వేసిన హైకోర్టు


గోగినేని ప్రసాద్..  చిరంజీవి , శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించిన ‘ఎస్పీ పరశురాం’ సినిమాకు నిర్మాతగా వ్యవహారించారు. ఈ సినిమాకు హీరో విశాల్ తండ్రి G.K.రెడ్డి, అల్లు అరవింద్ లు కూడా నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక గోగినేని ప్రసాద్ బాలీవుడ్ సినిమాలకి కూడా ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఆ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటించగా.. సినిమా పేరు ‘ది జెంటిల్మెన్’. గోగినేని ప్రసాద్ హిందీలో ‘గో వావా గాన్’, ‘కౌన్’, ‘ఏక్ విలన్’, మరియు 'ఛష్మే బద్దూర్' వంటి చిత్రాలను నిర్మించారు. ఇందులో ‘గో వావా గాన్' సినిమాకు ఆర్జీవి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా బాలీవుడ్ చిత్రాలకు గోగినేని ప్రసాద్ గారు లైన్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. 


Also Read: Apple Offers: మ్యాక్‌బుక్, ఐప్యాడ్‌లపై మళ్లీ బ్యాక్ టు స్కూల్ ఆఫర్లు, ఎంతంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook