ANR 100Th Birth Anniversary: ఇండియన్ సినీ లెజెండ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత  అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి పురస్కరించుకొని  హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాలతో పాటు వరంగల్, కాకినాడ, తుమకూరు, వడోదర, జలంధర్, రూర్కెలా వంటి  25 నగరాల్లో సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు 10 రిస్టోర్డ్ ANR క్లాసిక్స్ ప్రదర్శించనున్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో లెజెండ్ ANR యొక్క వెర్సటైల్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లు మరోసారి బిగ్ స్క్రీన్ చూసే ప్రత్యేక అవకాశం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు కలగనుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో  'దేవదాసు' (1953), 'మిస్సమ్మ' (1955)  'మాయాబజార్' (1957), 'భార్య భర్తలు' (1961), 'గుండమ్మ కథ' (1962), 'డాక్టర్ చక్రవర్తి' (1964), 'సుడిగుండాలు' (1968), 'ప్రేమ్ నగర్' (1971), 'ప్రేమాభిషేకం' (1981) 'మనం' (2014) సహా  ANR  ల్యాండ్‌మార్క్ మూవీస్ ను ఈ సందర్భంగా వివిధ నగరాల్లో  ప్రదర్శించనున్నారు.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం,  NFDC – నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా, PVR-Inox సహకారంతో దేశవ్యాప్తంగా ఈ ఫెస్టివల్స్ నిర్వహిస్తోంది.


ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ శివేంద్ర సింగ్ దుంగార్‌పూర్ మాట్లాడుతూ.. “అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్ రెట్రోస్పెక్టివ్‌ల భారీ విజయం తర్వాత, తెలుగు సినీ లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం ఈ ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ఫెస్టివల్‌ను ప్రదర్శించడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు.  1953 నుండి 2014 వరకు  సినిమాల ఎంపికలో ANR బిగ్గెస్ట్  హిట్‌లు ఉన్నాయి, అవి యాక్టర్ గా   ANR అద్భుతమైన నటన కనబరిచినవి ఉన్నాయి.


ఈ సినిమాలు దశాబ్దాలుగా  ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసాయి. మన సినిమా వారసత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ రెట్రోస్పెక్టివ్‌లలో మోడరన్  ప్రేక్షకులు క్లాసిక్ చిత్రాలను ఎంతగా ఇష్టపడుతున్నారో మేము చూశాము. ఈ సందర్బంగా ప్రత్యేకంగా ప్రదర్శించిన సినిమాలను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు ఆయా థియేటర్స్ లో కూడా హౌస్ ఫుల్ అవుతున్నాయి.  


అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. “ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ మా నాన్నగారి 100వ జయంతిని దేశవ్యాప్తంగా ఆయన ల్యాండ్‌మార్క్ సినిమాల ఫెస్టివల్ తో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. నాన్న గారు అన్ని రకాల పాత్రలతో  ప్రజల హృదయాలో నిలిచిపోయారు. అందుకే ఆయన్ని ప్రేక్షకులు నట  సామ్రాట్ అని పిలుస్తారు. దేవదాసులో నాన్నగారి నటన  సినిమా అన్ని వెర్షన్లలో అత్యుత్తమమైనదిగా గుర్తించబడింది.  ప్రేమాభిషేకం, డాక్టర్ చక్రవర్తి,  సుడిగుండాలు వంటి అనేక చిత్రాలు నేటికీ ఎంతగానో ఇష్టపడుతున్నారు. మన రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది వేసి అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించి మార్గదర్శకునిగా నిలిచారు. ఆయన లెగసీని కొనసాగించడం మాకు గర్వంగా వుందన్నారు.  ఈ పండుగ ద్వారా కేవలం తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకు ఒక ఐకాన్‌ను గుర్తుంచుకుంటారని భావిస్తున్నాను.  ప్రజలు ఆయనను మరో వందేళ్లు గుర్తుంచుకునేలా ఈ వారసత్వాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నామన్నారు. అక్కినేని ఫిల్మ్ ఫెస్టివల్ లో మాతో భాగస్వామ్యం అయినందుకు అక్కినేని కుటుంబం మొత్తం NFDC-NFAI , PVR-Inoxకి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.


అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ, “తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మార్గదర్శకుడు, భారతీయ సినిమాకి ఐకాన్ అయిన అక్కినేని నాగేశ్వరరావు గారి 100వ జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకను చేయడం ఆనందంగా ఉందన్నారు.  ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ భారతదేశం అంతటా ఆయన చిత్రాలను విడుదల చేయడం ద్వారా ఆయన లెగేసీని సెలబ్రేట్ చేసుకోవడం గొప్ప విశేషం అన్నారు.   ఆయన్ని  అనేక సందర్భాలలో కలుసుకునే భాగ్యం తనకు కలిగిందన్నారు. తెలుగు సినిమాకి ఈ స్థాయిలో రెట్రోస్పెక్టివ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. భారతీయ సినిమా వారసత్వాన్ని తిరిగి బిగ్ స్క్రీన్ పై తీసుకురావాలనే ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.


NFDC-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ (ఫిలిమ్స్), మేనేజింగ్ డైరెక్టర్ పృథుల్ కుమార్ మాట్లాడుతూ, “NFDC-NFAI శ్ ANR గారి శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కొలబరేట్ అవ్వడం  చాలా గౌరవంగా ఉందన్నారు. ఆయన నటించిన చిత్రాలను 4Kలో ప్రదర్శించనున్నట్టు తెలిపారు. ఈ చిత్రాలను నేషన్ తో  పంచుకోవడానికి వేదికను అందించిన PVR-INOXకి, అన్నపూర్ణ స్టూడియోస్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్‌కు  నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ కింద ఈ ప్రయత్నానికి ఫండ్స్ సమకూర్చినందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.


నట సామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు 71 సంవత్సరాల కెరీర్ లో 250పైగా  సినిమాలలో విభిన్న పాత్రల్లో అలరించారు. నిర్మాతగా అద్భుతమైన చిత్రాలు నిర్మించారు కూడా. మెయిన్ స్ట్రీమ్ సినిమాలు, ఆఫ్‌బీట్ చిత్రాలు, మైథాలజీ, సోషల్ డ్రామాలలో నటించి మెప్పించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ సహా మూడు పద్మ అవార్డులతో పాటు దేశ అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, తెలుగు చలన చిత్ర అత్యున్నత అవార్డు రఘుపతి వెంకయ్య అవార్డు సహా వివిధ ప్రైవేటు సంస్థలు అందించిే ఎన్నో అవార్డులు అందుకున్నారు. ANR హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించారు. అది తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కేంద్రంగా ఎదిగిన విషయం తెలిసిందే కదా.  ANR జనవరి 22, 2014న కన్నుమూసపారు. ఆయన  లెగసీని ఆయన తనయుడు  నాగార్జున, మనవళ్లు నాగ చైతన్య, అఖిల్ అక్కినేని ముందుకు తీసుకెళుతున్నారు.


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.