ఈ వారం వరుస సెలవుల కారణంగా థియేటర్లలో సినిమాలు సందడి చేస్తుంటే.. మరో పక్క సినిమాలు, వెబ్ సీరీస్ లు ఓటీటీలో దర్శనం ఇస్తున్నాయి. ఈ వారం ఓటీటీలో ప్రేక్షకులను అలరించబోతున్న సినిమాలు మరియు సీరీస్ లు ఏంటో చూద్దాం.. 
ఖుషి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ్ దేవరకొండ.. సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇపుడు ఓటీటీలో అలరించటానికి సిద్ధం అయింది. తెలుగు, తమిళ, కన్నడ మలయాళం మరియు హిందీ  భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 1 నుండి అన్ని భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనుంది. 


ఏజెంట్.. 
అఖిల్ అక్కినేని సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించగా చిత్రం ఏజెంట్.. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టులేకపోయిన.. ఓటీటీలో చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు సెప్టెంబర్ 29 నుండి సోని లీవ్ లో ప్రసారం కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కూడా ముఖ్య పాత్రలో నటించిన పెద్దగా ప్రభావం లేకపోయింది. 


పాపం పసివాడు.. 
ప్రముఖ సింగర్ శ్రీరామ్ చంద్ర మరియు గాయత్రి చాగంటి ప్రధాన పాత్రలలో నటించిన వెబ్ సీరీస్ పాపం పసివాడు. లవ్ ఫెయిల్ అయిన అబ్బాయిని తిరిగి ముగ్గురు అమ్మాయిలూ ప్రేమిస్తే ఎలా ఉంటుందో అనేదే ఈ సీరీస్ కథ. సెప్టెంబర్ 29 నుండి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. 


కింగ్ ఆఫ్ కొత్త.. 
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం కింగ్ ఆఫ్ కొత్త. దుల్కర్ సల్మాన్ స్నేహితుడు అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు నెలలలో థియేటర్లలో విడుదల అయింది. కానీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. మలయాళంతో పాటు తెలుగు భాషలోను ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. 


ఈ వారం ఓటీటీలో రానున్న మరిన్ని చిత్రాలు/ సీరీస్


అమెజాన్ ప్రైమ్ 
జెన్ వి 
కుమారి శ్రీమతి 
ది ఫేక్ షేక్  
హాస్టల్ డేజ్ సీజన్ 4 


నెట్ ఫ్లిక్స్ 
రెపెటైల్ 
చూనా 
డు నాట్ డిస్టర్బ్ 
లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ 


Also Read: Chandrababu Case: ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసుల వివరాలు ఇలా


పవర్ రేంజర్స్ కాస్మిక్ ఫ్యూరీ 
ఐస్ కోల్డ్ 
స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ 
కాసిల్వేనియా 
ద డెవిల్స్ ప్లాన్ 


డిస్నీ + హాట్ స్టార్ 
లాంచ్ పాడ్ 
తుమ్ సే నహీ పాయెగా 
ది వరస్ట్ ఆఫ్ ఈవిల్ 


సోనీ లీవ్ 
అధియా 
బుక్ మై షో 
బ్లూ బీటిల్ 


Also Read: Samsung Galaxy F04 Price: Samsung Galaxy F04పై స్పెషల్ డీల్‌..రూ.1,499కే పొందండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook