Samsung Galaxy F04 Price: Samsung Galaxy F04పై స్పెషల్ డీల్‌..రూ.1,499కే పొందండి..

Samsung Galaxy F04 Price: సాంసంగ్‌ కంపెనీ ఇటీవలే విడుదల చేసిన SAMSUNG Galaxy F04 మొబైల్‌ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనపు తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2023, 11:09 AM IST
Samsung Galaxy F04 Price: Samsung Galaxy F04పై స్పెషల్ డీల్‌..రూ.1,499కే పొందండి..

Samsung Galaxy F04 Price: మార్కెట్‌లో సాంసంగ్‌ కంపెనీ స్మార్ట్‌ ఫోన్స్‌కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సాధరణ బడ్జెట్‌లో కంపెనీ ఇటీవలే విడుదల చేసిన SAMSUNG Galaxy F04 మొబైల్‌కి ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో మంచి డిమాండ్‌ లభించింది. అయితే బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌ ఫోన్‌ ప్రత్యేక తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనపు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ ఏంటో?, వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మొదట సాంసంగ్‌ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ MRP ధరతో రూ. 11,499కే విక్రయించింది. ఈ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా SAMSUNG Galaxy F04 మొబైల్‌ రూ.6,499లకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంకు ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంకుతో బిల్‌ చెల్లిస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా సాంసంగ్‌ యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే 10 శాతం తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు ఫ్లిఫ్‌కార్ట్‌ సాంసంగ్‌ పవర్‌ బ్యాంక్‌, చార్జర్‌ కొనుగోలు చేసేవారికి 10 శాతం తగ్గింపు లభిస్తుంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
 
దీంతో పాటు మీరు ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా మీరు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేసి ఈ SAMSUNG Galaxy F04 మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 5,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 1,499కే పొందవచ్చు. SAMSUNG Galaxy F04 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన సమాచారం కోసం ఫ్లిఫ్‌కార్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.    

SAMSUNG Galaxy F04 ఫీచర్‌ వివరాలు:
❁ 6.5 అంగుళాలు డిస్‌ప్లే
❁ 720 x 1600 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 
❁ Mediatek MT6765 Helio P35 చిప్‌సెట్
❁ Android 12, One UI ఒయస్‌
❁ PowerVR GE8320 జీపీయు
❁ ఆక్టా-కోర్ సీపీయు
❁ డుయల్‌ కెమెరా సెటప్‌
❁ 13 MP బ్యాక్‌ కెమెరా
❁ 2 MP అదనపు కెమెరా
❁ 5 MP సెల్ఫీ కెమెరా
❁ USB టైప్-C 2.0
❁ Li-Po 5000 mAh బ్యాటరీ
❁ 15W వైర్డ్‌ ఛార్జింగ్ సపోర్ట్‌

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News