Google honour Zohra Sehgal with special doodle: భారతదేశం గర్వించదగిన నటీమణులు, లేడీ కొరియోగ్రాఫర్స్‌లో ఒకరైన జోహ్రా సెహగల్‌కి ( Actress Zohra Sehgal ) గూగుల్ మంగళవారం ప్రత్యేకమైన డూడుల్‌తో నివాళి అర్పించింది. గూగుల్ ఇవాళే నివాళి అర్పించడానికి కారణం ఈ రోజు ఆమె జయంతి కాదు... వర్థంతి కాదు.. కానీ జోహ్రా సినీ ప్రస్థానంలో ఈరోజుకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. 1946లో జోహ్రా నటించిన నీచ నగర్ అనే సినిమా ( Neecha Nagar movie ) కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో విడుదలై.. ఫిలిం ఫెస్టివల్‌లో ఇతర చిత్రాలకన్నా ఎక్కువ ప్రశంసలు అందుకుంది. నీచ నగర్ సినిమాకు కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ( Cannes film festival) పట్టం కట్టింది. Also read : Pawan Kalyan's role in PSPK28: పవన్ కల్యాణ్ పాత్రపై ఇంట్రెస్టింగ్ టాక్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జోహ్రా పూర్తి పేరు సాహిబ్జాది బేగం జోహ్రా ముంతాజుల్లా ఖాన్ ( Sahibzaadi Begum Zohra Mumtazullah Khan). 1912లో ఏప్రిల్ 27న ఉత్తర్ ప్రదేశ్‌లో జన్మించిన జోహ్రా ఖాన్.. తనకు 20 ఏళ్ల వయస్సున్నప్పుడు ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లారు. ప్రముఖ ఇండియన్ డ్యాన్సర్ ఉదయ్ శంకర్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా పర్యటించి ప్రదర్శనలు ఇచ్చారు. ఉదయ్ శంకర్ బృందానికి ఆమె టీచర్‌గానూ సేవలు అందించారు. 1942, ఆగస్టులో కామేశ్వర్ సెహగల్‌ని పెళ్లి చేసుకుని తన పేరును జోహ్రా సెహగల్‌గా ( Zohra Sehgal ) మార్చుకున్నారు. 


బాలీవుడ్ సినీ పరిశ్రమకు ( Bollywood film industry ) సెహగల్ అందించిన సేవలు అంతా ఇంతా కాదు.. అనేక చిత్రాల్లో నటించి, కొరియోగ్రఫీ అందించిన ఆమె 2014లో జూలై 10న తనకు 102 ఏళ్ల వయస్సున్నప్పుడు పరమపదించారు. Also read : Sarkaru vaari paata: మహేష్ బాబుకి విలన్‌గా ఒకప్పటి స్టార్ హీరో


జోహ్రా సెహగల్ జీవిత చరమాంకంలోనూ పలు చిత్రాల్లో ( Zohra Sehgal movies ) నటించడం విశేషం. 2007లో రణ్‌బీర్ కపూర్            , సోనం కపూర్‌లను తొలి పరిచయం చేస్తూ సంజయ్ లీలా భన్సాలీ ( Sanjay Leela Bhansali ) డైరెక్ట్ చేసిన సావరియాలోనూ జోహ్రా సెహగల్ నటించారు. చీని కమ్, హమ్ దిల్ దే చుకేసనం, దిల్ సే, కభీ ఖుషీ కభీ ఘమ్, వీర్ జరా వంటి చిత్రాలు ఆమె తన జీవిత చరమాంకంలో నటించిన చిత్రాల జాబితాలో ఉన్నాయి. Also read : Drugs case: రకుల్ ప్రీత్ సింగ్ ఆర్థిక లావాదేవీలపై కన్నేసిన NCB


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe