Pawan Kalyan's role in PSPK28: పవన్ కల్యాణ్ పాత్రపై ఇంట్రెస్టింగ్ టాక్

Last Updated : Sep 29, 2020, 02:42 AM IST
Pawan Kalyan's role in PSPK28: పవన్ కల్యాణ్ పాత్రపై ఇంట్రెస్టింగ్ టాక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) తన 28వ సినిమా కోసం డైరెక్టర్ హరీష్ శంకర్‌కు ( Director Harish Shankar ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా, ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ( PSPK28 poster ) కూడా మేకర్స్ ఆవిష్కరించారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఇండియా గేట్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ఫొటోలు ఉన్నాయి. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఉంటుందని ఆ పోస్టర్ ఆధారంగా అభిమానులకు హింట్ ఇచ్చారు.

ప్రస్తుతం హరీష్ శంకర్ ఈ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్‌ని పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని మొదటి ఓ టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వినిపిస్తున్న ఫిలింనగర్ టాక్ ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ ( Pawan Kalyan as lecturer ) పాత్రలో కనిపించబోతున్నాడని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని, ఈ సినిమాలో హరీష్ శంకర్ స్ట్రాంగ్ సోషల్ మెస్సేజ్‌ను, పవర్‌ఫుల్ డైలాగ్స్ కూడా స్క్రిప్టులో రాసినట్లు సమాచారం. Also read : Sarkaru vaari paata: మహేష్ బాబుకి విలన్‌గా ఒకప్పటి స్టార్ హీరో

ఈ ప్రాజెక్ట్ 2021 రెండవ భాగంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో పవన కల్యాణ్ సరసన పూజా హెగ్డేను ( Actress Pooja Hegde ) సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 

అన్నట్టు గతంలో అన్నయ్య చిరంజీవి ( Chiranjeevi ) సైతం లెక్చరర్ పాత్రలో మాస్టార్ సినిమా ( Master Telugu movie ) చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. సురేష్ క్రిష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో చిరంజీవి సరసన రోషిని, సాక్షిశివానంద్ జంటగా నటించారు. 1997లో వచ్చిన ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి ( Posani Krishna Murali ) రాసిన డైలాగ్స్ మెగా ఫ్యాన్స్‌కి కెవ్వు కేక అనిపించాయి. Also read : Drugs case: రకుల్ ప్రీత్ సింగ్ ఆర్థిక లావాదేవీలపై కన్నేసిన NCB

ఇక పవన్ కల్యాణ్ ఇతర చిత్రాల విషయానికొస్తే.. ప్రస్తుతం వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తోన్న Vakeel Saab movie షూటింగ్ క్లైమాక్సులో ఉండగా ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో #PSPK27 చేయనున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్‌లో 28వ సినిమా చేయనున్న పవన్.. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో #PSPK29 సినిమాకు సైన్ చేశాడు. వకీల్ సాబ్ తర్వాత సైన్ చేసిన ఈ మూడు చిత్రాల వివరాలను, ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ ఇటీవల పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదలయ్యాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News