Bhimaa movie OTT Streaming: ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చేసిన గోపీచంద్ `భీమా`..
Bhimaa movie OTT Streaming: గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `భీమా`. గౌతమ్ నందా` తర్వాత మరోసారి ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసాడు. ఇప్పటికే థయేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Bhimaa movie OTT Streaming: గోపీచంద్ గత కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. తాజాగా ఈయన 'భీమా' సినిమాతో పలకరించారు. మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అది వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించింది. టోటల్‌గా గోపీచంద్ కెరీర్‌లోనే మరో ఫ్లాప్‌గా మూవీగా మిగిలిపోయింది. తాజాగా ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్‌లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మాస్ హీరోగా రాణిస్తోన్న గోపిచంద్‌కు వరుస ఫ్లాపులు ఈయన కెరీర్‌ను డైలామాలో పడేస్తున్నాయి. మాస్ హీరో ఇమేజ్‌తోనే గోపీచంద్‌కు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. కానీ అందుకు తగ్గట్టు కథలు సెలెక్ట్ చేసుకోవడంలో గోపీచంద్ తప్పటడుగులు వేస్తున్నాడు. 'సీటీమార్' తర్వాత ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మారుతి 'పక్కా కమర్షియల్' మూవీ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత చేసిన 'రామబాణం' సినిమా రొటీన్ ఫ్యామిలీ డ్రామా కావడంతో ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరించలేదు. .రీసెంట్‌గా కన్నడ దర్శకుడు హర్ష డైరెక్షన్‌లో తనకు అచ్చొచ్చిన యాక్షన్ జానర్‌లో 'భీమా' సినిమాతో పలకరించిన పెద్దగా ప్రయోజనం లేకపోయింది.
భీమా సినిమా ఓవరాల్‌గా రూ. 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా 8.46 కోట్ల షేర్ రాబట్టి 70 శాతం రికవరీ చేసింది. మొత్తంగా చూసుకుంటే గోపీచంద్ గత చిత్రాల కంటే కాస్త బెటర్ అని చెప్పాలి. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ వేదికగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
భీమా సినిమాలో గోపీచంద్ 'భీమా' పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ మూవీని శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ మూవీలో నాగ చైతన్య '7ధూత' ఫేమ్ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. అంతేకాదు మాళవిక శర్మ ఇంపార్టెంట్ రోల్స్‌లో యాక్ట్ చేశారు. ఈ చిత్రానికి కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు.
Also read: Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook