Gopichand Cop Role in Harsha Directorial: మ్యాచో స్టార్ గోపీచంద్ ఈ మధ్యనే రామబాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని శ్రీ వాస్ డైరెక్ట్ చేశారు. లక్ష్యం, లౌక్యం లాంటి హిట్ సినిమాలు తర్వాత గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మాత్రం కొత్తగా లేదని పెదవి విరిచారు ప్రేక్షకులు. పాత కథ కావడం దానికి పెద్దగా హంగులు ఆర్భాటాలు కూడా జోడించకపోవడంతో ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదని చెబుతున్నారు. అయితే ఈ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా గోపీచంద్ మరో సినిమా లైన్లో పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా గోపీచంద్ ఫైనల్ చేసిన ఆయన పాత్ర ఇదే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది.


Also Read: Ustaad Bhagat Singh: ఈ సారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్దంటున్న ఉస్తాద్ భగత్ సింగ్


కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో గోపీచంద్ సినిమా ఆ మధ్య అట్టహాసంగా ప్రారంభమైన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో గోపీచంద్ నటిస్తున్న పాత్ర గురించి ఇప్పుడు తాజాగా వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమాలో గోపీచంద్ ఒక పోలీసు అధికారి పాత్రలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. గోపీచంద్ 31వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని కన్నడ డైరెక్టర్ హర్ష తెరకెక్కిస్తున్నారు. హర్ష శివ రాజ్ కుమార్ హీరోగా వేద అనే సినిమా డైరెక్ట్ చేయగా ఆ సినిమా కన్నడ నాట సూపర్ హిట్ గా నిలిచింది.


మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ గోపీచంద్ హర్ష కాంబినేషన్ సినిమాని సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ మీద కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. అలాగే కేజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తూ ఉండడం మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఈ సినిమాతో అయినా గోపీచంద్ సూపర్ హిట్ అందుకుని మళ్ళీ హిట్ల పరంపరలోకి వస్తాడేమో వేచి చూడాల్సి ఉంది. రామబాణం సినిమా దెబ్బకు ఈ సినిమా మేకర్స్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది.


Also Read: Simran Choudhary Photos: షర్ట్ విప్పేసి 'బ్రా' అందాలతో సిమ్రాన్ అరాచకం.. ఈ హీటు తట్టుకోగలరా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook