Viswam: 20 రోజుల్లోనే ఓటిటిలోకి గోపీచంద్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
Viswam OTT: ఒకప్పుడు వరస హిట్లతో దూసుకుపోయిన హీరో గోపీచంద్. ముఖ్యంగా హీరో కన్నా కూడా విలన్ గా గోపీచంద్ కి ఎన్నో మంచి విజయాలు..దక్కాయి. ఆ తరువాత హీరోగా మారి.. మంచి విజయాలను దక్కించుకున్నారు ఈ నటుడు. కాగా గోపీచంద్ ఈ మధ్య నటించిన చిత్రం విశ్వం. ఈ సినిమా 20 రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసి అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
Gopichand Viswam OTT: శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా చేసిన సినిమా విశ్వం. ఈ ఇద్దరికీ కూడా తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం.. విజయం ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు వరస విజయాలు అందించిన శ్రీను వైట్ల.. గత కొద్ది సంవత్సరాలుగా వరస ప్లాపులతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని కసితో తీసిన సినిమా విశ్వం. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని.. ఈ దర్శకుడు పలు ఇంటర్వ్యూలో నమ్మకం వ్యక్తం చేశారు.
మరో పక్క గోపీచంద్ కి కూడా ఈ మధ్య వరస ప్లాపులు వచ్చాయి. దాంతో గోపీచంద్ కూడా మళ్లీ విశ్వం సినిమాతో కం బ్యాక్ ఇస్తాడు అని అందరూ నమ్మారు. అయితే వీరందరి నమ్మకాలు కూడా తలకిందులయ్యాయి. విశ్వం సినిమా కేవలం యవరేజ్ గా మాత్రమే నిలిచింది. శీను వైట్ల ఒకప్పుడు కామెడీ మొత్తం ఈ చిత్రంలో చూపించినప్పటికీ.. కథ, కథనం.. శీను వైట్ల పాత సినిమాలను గుర్తు చేయడంతో.. ఈ చిత్రం పాత చింతకాయ పచ్చడి లాగా ఉంది అంటూ ఎంతోమంది.. విమర్శలు కురిపించారు.
ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా కేవలం 20 రోజుల్లోనే.. ఓటిటిలోకి వచ్చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకూ.. కేవలం రూ.17 కోట్ల వరకే వసూలు చేసినట్లు టాక్ . ఇక ఇంతలోనే ఈ చిత్రం బుల్లితెరపైకి వచ్చేసింది.
ఈ చిత్రం ఈ మధ్యనే అక్టోబర్ 11న థియేటర్లలలో విడుదలైంది. ఇక ఎప్పుడు దీపావళి సందర్భంగా నవంబర్ 1న ఓటీటీలో అడుగుపెట్టింది. అంటే కేవలం థియేటర్లో రిలీజైన 20 రోజులకే.. గోపీచంద్ విశ్వం సినిమా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం నిన్న రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఒక్క తెలుగులో మాత్రమే విశ్వం స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఇక ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.