Gruhalakshmi Lasya Mother జీ తెలుగులో ఇప్పుడు సూపర్ క్వీన్ షో సందడి చేస్తోంది. ఇందులో బుల్లితెర తారలు మెరుస్తున్నారు. సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ షోలు, సినిమాలు, సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన స్టార్స్‌ను సూపర్ క్వీన్‌ సెకండ్ సీజన్‌కు పట్టుకొచ్చారు. ఇందులో కండక్టర్ ఝాన్సీ, గృహలక్ష్మీ లాస్య, సామీ సామీ అంటూ పాట పాడి ఫేమస్ అయిన మౌనిక యాదవ్ వంటి వారున్నారు. లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ కూడా ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అందరూ తమ తమ ఒరిజినల్ కథలు చెప్పారు. తమ తమ జీవితాల్లో జరిగిన కష్టాలు, నష్టాల గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇందులో కొందరు తమ అమ్మ గురించి, తమ గురువుల గురించి, తమ భర్తల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. విద్యుల్లేఖ తన భర్త గురించి చెప్పింది. లేడీ కండక్టర్ ఝాన్సీ తన గురువు గురించి చెప్పుకొచ్చింది. అతడి వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చింది.


 



కనకవ్వ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా వచ్చింది. అరవై ఏళ్ల తరువాత తన కెరీర్ ప్రారంభమైందని, అసలు ఈ స్థాయిలో తనకు ఆదరణ లభిస్తుందని తాను ఊహించలేదని కనకవ్వ చెప్పుకొచ్చింది. గృహలక్ష్మీ సీరియల్‌లో లాస్య పాత్రలో ప్రశాంతి బుల్లితెరపై అదరగొట్టేస్తోంది. లేడీ విలన్స్‌లో గ్లామరస్‌ బ్యూటీగా ప్రశాంతి పేరు సంపాదించుకుంది.


Also Read:  Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్


అలాంటి ప్రశాంతి సూపర్ క్వీన్ షోలో అందరినీ ఏడిపించింది. తన అమ్మ తన కోసం ఎంతో కష్టపడిందని, ఎంతో సపోర్ట్ చేసిందని, తన అమ్మకు లివర్ క్యాన్సర్ అని, ఒకరోజు సడెన్‌గా చనిపోయిందని చెబుతూ స్టేజ్ మీదే కంటతడి పెట్టేసింది. ఆమె బాధను చూసి ప్రదీప్ సైతం ఎమోషనల్ అయ్యాడు. అలా స్టేజ్ మీదున్న ప్రతీ ఒక్కరికీ ఒక్కో కథ, వ్యథ ఉంది. ప్రతీ ఆదివారం ఈ సూపర్ క్వీన్ షో బాగానే రన్ అవుతోంది.


Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook