Gruhalakshmi Tulasi : కారు, ఏసీ, టీవీలు లేవు.. ఫోన్ పోయింది.. సంపాదించిందంతా కూడా అటే.. గృహలక్ష్మీ తులసి
Kasthuri Shankar Tweets కస్తూరీ శంకర్ తాజాగా ఓ ట్వీట్ వేసింది. తనకు కారు గానీ, ఏసీ గానీ, టీవీ గానీ ఏదీ లేదని చెప్పింది. తాను ఒక సాధారణ జీవితాన్ని గడుపుతానంటూ చెప్పుకొచ్చింది.
Kasthuri Shankar lost her phone : గృహలక్ష్మీ సీరియల్‌తో తులసిగా కస్తూరీ శంకర్ ఇప్పుడు తెలుగు వారికి మరింతగా దగ్గరైంది. ఈ సీరియల్ ఇంతగా క్లిక్ అవ్వడంతో ఆమెకు సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. పరంపర అనే వెబ్ సిరీస్‌లో కస్తూరీ శంకర్ కాస్త బోల్డ్ కారెక్టర్ కూడా చేసింది. అయితే కస్తూరీ శంకర్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. కస్తూరీ ఏరి కోరి మరీ కాంట్రవర్సీలను నెత్తిన వేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది.
ట్విట్టర్‌లో కస్తూరీ శంకర్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన మీద వచ్చే నెగెటివ్, పాజిటివ్ ట్వీట్లకు స్పందిస్తూ వెంటనే రియాక్ట్ అవుతుంది. తాజాగా తన ఫోన్ మెట్రోలో ప్రయాణిస్తుండగా పోయిందట. అయితే ఇదే విషయాన్ని మెట్రో అధికారులకు కంప్లైంట్ చేసిందట. వెంటనే వారు స్పందించి ఫోన్‌ను కనిపెట్టడంతో కస్తూరీ మురిసిపోయింది. చెన్నై పట్ల, ఇక్కడి అధికారుల పట్ల మరింత గౌరవం పెరిగిందని కస్తూరీ ట్వీట్ వేసింది.
నీకు సొంతంగా కార్లుంటాయ్ కదా? వాటిలో ప్రయాణించొచ్చు కదా? ఇదంతా ఎందుకు పబ్లిసిటీ కోసమా? అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి కస్తూరీ శంకర్ ఇలా సమాధానం ఇచ్చింది. నాకు కారు, ఏసీ, టీవీ ఇలా ఏవీ లేవు.. నేను ఒక సాధారణ జీవితాన్ని గడుపుతాను అని చెప్పుకొచ్చింది. దీనిపై మరో నెటిజన్ ఇలా అడిగేశాడు. నువ్ సంపాదించిందంతా? ఏం చేస్తావ్ అని అడిగేశాడు. నేను సంపాదించిందంతా కూడా మెడికల్ హెల్ప్, చైల్డ్ క్యాన్సర్ పేషెంట్స్ కోసమే ఖర్చు పెడతాను అంటూ తన దాతృత్వం గురించి బయటపెట్టేసింది.
మొత్తానికి కస్తూరీ శంకర్ మాత్రం ఓ సాధారణ జీవితాన్ని గడుపుతూ.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. తనకు చేతనైనంతలో వైద్య సాయం చేస్తోంది. చిన్న పిల్లల కోసం తన సంపాదన అంతా కూడా వెచ్చిస్తోందని నెటిజన్లు ఆమెను పొగిడేస్తున్నారు.
Also Read : Tawang Border Issue : బార్డర్‌లో చైనా సైనికుల తుక్కురేగ్గొడుతున్న భారత ఆర్మీ.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook