Guntur Kaaram Day 1 Collections: త్రివిక్రమ్ దర్శకత్వంలో.. మహేష్ బాబు హీరోగా చేసిన సినిమా గుంటూరు కారం. శ్రీలీల,‌ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల అయింది. ఈ చిత్రానికి పోటిగా అదే జనవరి 12న హనుమాన్ సినిమా విడుదలవ్వగా…ఈరోజు జనవరి 13న వెంకటేష్ సైంధవ్ రిలీజ్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా ఈ మూడు చిత్రాలలో హనుమాన్ సినిమాకి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ రాగా మిగతా రెండు చిత్రాలు మిశ్రమ స్పందన మాత్రమే తెచ్చుకోగలిగాయి. అయితే మహేష్ బాబు సినిమాకి మిశ్రమ స్పందన వచ్చిన మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ము దులిపింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న మూడో సినిమా కావటంతో ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే మొదటిరోజు టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోయింది ఈ సినిమా.


ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హరికా హసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్య దేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 132 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి.. దాదాపు 135 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది.


ఇక ఈ చిత్రాన్ని ఆంధ్రా, నైజాంలో 1050 స్క్రీన్లు, ఇండియా మొత్తం పైన 150 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 850 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అనగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2000 స్క్రీన్లలో రిలీజ్ అయ్యింది. ఇక ప్రీ బుకింగ్ తో హవా మొదలుపెట్టిన ఈ చిత్రం.. మొదటిరోజు అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా 94 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేశారు.


మహేష్ బాబు కెరియర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే అని…అలానే రీజనల్ సినిమాలలో ఇంతటి కలెక్షన్ సొంతం చేసుకున్న మొదటి సినిమా ఇదే అని మేకర్స్ అఫీషియల్ గా తెలియజేశారు. దీంతో మహేష్ అభిమానుల సంబరానికి హద్దు లేకుండా పోయింది. మిశ్రమ స్పందనతోనే బాబు ఇంతటి రికార్డ్ సాధించారని కామెంట్లు పెడుతున్నారు. 


Also Read: Saindhav Twitter Review: సైంధవ్ ట్విట్టర్ రివ్యూ.. ఇది పెద్దోడి విశ్వరూపం.. వెంకీ మామ హిట్ కొట్టేశాడా..?  


Also Read: January Bank Holidays List: బిగ్ అలర్ట్.. బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు..!   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook