Saindhav Twitter Review: సైంధవ్ ట్విట్టర్ రివ్యూ.. ఇది పెద్దోడి విశ్వరూపం.. వెంకీ మామ హిట్ కొట్టేశాడా..?

Saindhav Movie Public Talk: వెంకటేష్-శైలేష్‌ కొలను కాంబోలో భారీ బడ్జెట్‌ చిత్రంగా సైంధవ్ తెరకెక్కింది. వెంకీ మామ కెరీర్‌లో 75వ సినిమా కావడంతో ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. మరి సంక్రాంతి బరిలో వెంకీ మామ హిట్ కొట్టేశాడా..? ట్విట్టర్‌లో టాక్ ఎలా ఉంది..?  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 13, 2024, 06:52 AM IST
Saindhav Twitter Review: సైంధవ్ ట్విట్టర్ రివ్యూ.. ఇది పెద్దోడి విశ్వరూపం.. వెంకీ మామ హిట్ కొట్టేశాడా..?

 Saindhav Movie Public Talk: విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో 75వ సినిమాగా తెరకెక్కిన మూవీ సైంధవ్. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించగా.. శ్రద్దా శ్రీనాథ్, ఆర్య, ఆండ్రియా, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితర భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో వెంకటేష్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా రూపొందించారు. టీజర్, ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన సైంధవ్ మూవీ.. సంక్రాంతి కానుకగా నేడు (జనవరి 13న) ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. తెలుగుతో తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో షోలు పూర్తవ్వడంతో నెటిజన్లు సైంధవ్ మూవీపై రివ్యూలు ఇస్తున్నారు. మరీ వెంకీ మామ హిట్ కొట్టేశాడా..? ట్విట్టర్ టాక్ ఎలా ఉంది..? ఓ లుక్కేద్దాం పదండి..

వెంకీ మామ ఫ్యాన్స్ అయితే ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. సైంధవ్ మూవీ బాగుందని మెచ్చుకుంటున్నారు. పెద్దోడి విశ్వరూపం అంటూ పోస్టులు పెడుతున్నారు. మూవీని చూసి ఎంజయ్ చేయొచ్చని చెబుతున్నారు. సైంధవ్ సినిమా చాలా డీసెంట్‌గా అనిపించిందని.. నవాజుద్దిన్ సిద్దిఖీ నటన, వెంకీ మామ చేసిన కొన్ని సీన్లు, క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా అనిపిస్తాయని రివ్యూలు ఇస్తున్నారు. అయితే తాను ఎన్నో అంచనాలను పెట్టుకున్నానని.. వాటిని అందుకోలేకపోయిందని ఓ నెటిజన్ అన్నాడు. అయితే సినిమా మాత్రం ఎక్కడా బోర్ కొట్టలేదన్నాడు. 

 

 

సైంధవ్ మూవీని ఒక్కసారి చూడొచ్చని.. వెంకీ మామ భయపెట్టేశాడని మరికొందరు అంటున్నారు. ఓ మై గాడ్ అనేలా చేశాడని ప్రశసింస్తున్నారు. ఫుల్ వయలెన్స్.. ఆర్ఆర్, బీజీఎం అదిరిపోయాయని చెబుతున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖి యాక్టింగ్‌కు మంచి మార్కులు పడుతున్నాయి.  

 

ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉందని చెబుతున్నారు. ప్రారంభంలో చాలా కథ స్లోగా ప్రారంభమైనా.. 30 నిమిషాల తరువాత స్పీడ్ అందుకుంటుందని అంటున్నారు. యాక్షన్స్ సీక్వెన్స్ చాలా బాగున్నాయని.. నటీనటులు యాక్టింగ్‌తో ఆకట్టుకుంటారని కామెంట్స్ చేస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోరుకు మంచి టాక్ వస్తోంది. ఎమోషన్‌ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. కథ అంతా కూడా ఎమోషనల్‌గా బాగుందని మెచ్చుకున్నాడు. వెంకీ ఇంటెన్స్ సీన్స్ చాలా బాగున్నాయని రాసుకొచ్చాడు.

 

సెకండాఫ్ బాగుందని.. కానీ ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిందని కొందరు రివ్యూలు ఇస్తున్నారు. అయితే ఓవరాల్‌గా హిట్ బొమ్మ అని చెబుతున్నారు. స్టోరీ లైన్ బాగుందని మెచ్చుకుంటున్నారు. మొత్తానికి సైంధవ్ మూవీకి ట్విట్టర్‌లో పాజిటివ్ టాక్ వస్తుండడంతో వెంకీ మామ ఫ్యాన్స్‌ ఉత్సాహంగా ఉన్నారు. ఫైనల్ రివ్యూ మరి కాసేపట్లో రానుంది.

 

Trending News