Kurchi Madathapetti: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న సినిమా గుంటూరు కారం. సంక్రాంతికి విడుదల కాబోయే ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు.. పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా న్యూ ఇయర్ స్పెషల్ అంటూ నిన్న విడుదల చేసిన కుర్చీ మడత పెట్టి ప్రోమో సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిత్రం ఫుల్ సాంగ్ ఈరోజు డిసెంబర్ 30న విడుదల చేస్తాము అని మేకర్స్ ఆ ప్రోమోలో ప్రకటించడంతో.. ఈరోజు ఉదయం నుంచి మహేష్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఎట్టకేలకు ఈ సాంగ్ కొద్ది నిమిషాల క్రింద యూట్యూబ్లో విడుదలయింది. మాస్ బీట్ తో తెరకెక్కిన ఈసాంగ్ మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుంది. సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఆ కుర్చీని మడత పెట్టి డైలాగ్ తో ఈ సాంగ్ ను తెరకెక్కించారు.“రాజమండ్రి రాగమంజరి.. మాయమ్మ పేరు తలవనోళ్లు లేరు మేస్త్రీ.. కళాకారుల ఫ్యామిలీ మరీ.. మేగజ్జ కడితే నిదరపోదు నిండు రాతిరి” అంటూ ఈ సాంగ్ మొదలైంది. “ఆ కుర్చీని మడతపెట్టి” అంటూ డీజే సాంగ్‍లా ఈ పాట ఒక లెవెల్ కి వెళ్లి ఫ్యాన్స్ ని ఫిదా చేస్తోంది. 


ఈ సాంగ్‍కు మంచి ఊపున్న మాస్ బీట్‍ను సంగీత దర్శకుడు ఎస్.థమన్ అందించారు. సాహితి చాగంటి, శ్రీకృష్ణ ఈ సాంగ్‍ను పాడగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.


ఈ సాంగ్ లో మహేష్ బాబు శ్రీ లీల డాన్స్ ఇరగదీశారు. నిన్న విడుదలైన ప్రోమోతోనే ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం అయిపోయింది. ఇక పూర్తి పాట ఈరోజు విడుదలై అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ సాంగ్ థియేటర్స్ లో దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. సంక్రాంతికి ఉర మాస్ సాంగ్ అంటే ఇదేనేమో అనేలా చేస్తుంది ఈ పాట. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాటని ఒకసారి చూసేయండి. 


 



కాగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ  సినిమాలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇక ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అయ్యి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. 


Also Read: Oneplus Nord Ce 3 5G Price: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..


Also Read: Devil Movie Review: కళ్యాణ్‌ రామ్ డెవిల్ మూవీ రివ్యూ.. బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాడా..?


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter