Guntur Kaaram :ఫ్లాప్ టాక్‌తో ఈ కొట్టుడు ఏంది సామి.. గుంటూరు కారం ఖాతాలో మరో ఎపిక్ రికార్డు..
Guntur Kaaram 1st week box office collections: సంక్రాంతి సీజన్‌లో అందరి కళ్లు మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల గుంటూరు కారంపైనే ఉంది. ఫస్ట్ డే మిక్స్‌డ్ టాక్ తో ప్రారంభమైన ఈ మూవీ నిన్నటితో మొదటి వారం పూర్తి చేసుకుంది. అంతేకాదు డివైడ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లను రాబట్టింది.
Guntur Kaaram 7 Days box office collections: సంక్రాంతి సినిమాల్లో భారీ ఎక్సెపెక్టెషన్స్‌తో విడుదలైన గుంటూరు కారం మొదటి రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ డే మహేష్ బాబు ఇమేజ్‌తో పాటు త్రివిక్రమ్ స్టార్ డమ్ వంటివి ఈ సినిమాకు బాగానే కలిసొచ్చి సాలిడ్ వసూళ్లను రాబట్టింది.అంతేకాదు రూ. 90 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో నాన్ ప్యాన్ ఇండియా క్యాటగిరిలో హైయ్యెస్ట్ ఫస్ట్ డే వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. మరోవైపు ఈ సినిమాకు పోటీగా విడుదలైన హనుమాన్ మూవీ సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాన్ని సైతం తట్టుకుంటూ ఓన్లీ మహేష్ బాబు ఇమేజ్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ సినిమాకు ఈ ఫలితం రావడంపై అందరు గురూజీ (త్రివిక్రమ్) వైపు వేలెత్తి చూపెడుతున్నారు.
బడా స్టార్ హీరోను పెట్టుకొని కేవలం సింగిల్ లైన్ పాయింట్ తో ఈ సినిమాను చుట్టేసాడు.తల్లితో కుమారుడికి ఎలాంటి సంబంధం లేదంటూ ప్రామిసరి నోట్ రాసి ఇవ్వడంపైనే ఈ సినిమాను నడింపించాడు. అందులో మహేష్ బాబు మాస్ క్యారెక్టర్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ పాత్రను డిజైన్ చేసాడు. అంతేకాదు మహేష్ బాబును కొత్తగా చూపించడంతో పాటు పోకిరి తరహాలో వింటేజ్ లుక్ పై పెట్టిన శ్రద్ధ కథ, కథనాలపై పూర్తిగా కేటాయించ లేకపోయాడు. మొత్తంగా త్రివిక్రమ్ ఈ సినిమాను మహేష్ బాబు భుజ స్కంధాలపై ఉంచాడు. ఆయన నమ్మకాన్ని మహేష్ బాబు నిలబెట్టాడు.మొత్తంగా పండగ సీజన్‌లో ఇలాంటి టాక్‌తో ఈ సినిమా దాదాపు 80 శాతం రికవరీ సాధించడం వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు ఇమేజ్‌తో పాటు పండగ సీజన్ కూడా కలిసి వచ్చింది.
ఈ సినిమా నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు వచ్చిన వసూళ్ల విషయానికొస్తే..
తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 81.31 కోట్లు..షేర్ రాబట్టింది.
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ ..రూ. 6 కోట్లు..
ఓవర్సీస్.. రూ. 14.15 కోట్ల షేర్ రాబట్టింది.
మొత్తంగా మొదటి వారం పూర్తయ్యే సరికి గుంటూరు కారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 101.46 కోట్ల షేర్ (రూ. 165.05 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read Car Mileage Boosting Tips: ఎలాంటి ఖర్చులు లేకుండా ఈ టిప్స్‌తో మీ కారు మైలేజీని పెంచుకోవచ్చు..
ఈ సినిమా రూ. 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్డర రూ. 31.54 కోట్ల రాబట్టాలి. మొత్తంగ పండగ సీజన్ ముగిసిన నేపథ్యంలో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter